T20 World Cup 2022 : నెట్ రన్ రేట్ అసలు కథ ఇదేనా.. ఇంత ఈజీగా లెక్కిస్తారా!
T20 World Cup 2022 : నెట్ రన్ రేట్ అసలు కథ ఇదేనా.. ఇంత ఈజీగా లెక్కిస్తారా!
T20 World Cup 2022 India Schedule : ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో.. రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు సమానమైన పాయింట్లను కలిగి ఉన్న సమయంలో నెట్ రన్ రేట్ ద్వారా ఏ జట్లు తర్వాతి రౌండ్ కు వెళ్తాయో నిర్ణయిస్తారు.
క్రికెట్ లో నెట్ రన్ రేట్ (Net Run Rate)కు చాలా ప్రాధాన్యత ఉంది. ద్వైపాక్షిక సిరీస్ ల్లో నెట్ రన్ రేట్ తో అవసరం లేకపోయినా.. టోర్నీల్లో మాత్రం దీనికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. (PC : TWITTER)
2/ 8
ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో.. రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు సమానమైన పాయింట్లను కలిగి ఉన్న సమయంలో నెట్ రన్ రేట్ ద్వారా ఏ జట్లు తర్వాతి రౌండ్ కు వెళ్తాయో నిర్ణయిస్తారు. (PC : TWITTER)
3/ 8
అయితే ఈ నెట్ రన్ రేట్ ను ఎలా లెక్కిస్తారో చాలా మందికి ఒక పజిల్ లా ఉంటుంది. ఇప్పుడు నెట్ రన్ రేట్ ను ఎలా లెక్కిస్తారో ఉదాహరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (PC : TWITTER)
4/ 8
ఒక టోర్నీలో ఒక జట్టు చేసిన మొత్తం పరుగులను.. అందుకోసం ఉపయోగించిన ఓవర్లతో భాగిస్తారు (A). అదే సమయంలో ప్రత్యర్థికి సమర్పించుకున్న పరుగులను అందుకోసం అవసరమైన ఓవర్లతో భాగిస్తారు (B). ఇప్పుడు A-B చేస్తే నెట్ రన్ రేట్ వస్తుంది. (PC : TWITTER)
5/ 8
ఒక జట్టు 10 ఓవర్లకు ఆలౌటైనా.. నెట్ రన్ రేట్ ను లెక్కించేప్పుడు దానిని 20 ఓవర్లుగానే పరిగణిస్తారు. అదే సమయంలో చేజింగ్ లో ఒక జట్టు ప్రత్యర్థి స్కోరును 15 ఓవర్లలో ఛేదిస్తే అప్పుడు 15 ఓవర్లను తీసుకుంటారు. (PC : TWITTER)
6/ 8
ఒక టోర్నీలో ఒక జట్టు రెండు మ్యాచ్ ల్లో 40 ఓవర్లలో 260 పరుగులు చేసిందని అనుకుందాం. ప్రత్యర్థులకు 40 ఓవర్లలో 236 పరుగులు సమర్పించుకుందనుకుందాం. (PC : TWITTER)
7/ 8
మొదట 260ని 40 ఓవర్లతో భాగిస్తారు.. అంటే 260/40= 6.5 వస్తుంది. ఆ తర్వాత 236 పరుగులను 40 ఓవర్లతో భాగిస్తారు. అంటే 236/40= 5.9 వస్తుంది. ఇప్పుడు 6.5 నుంచి 5.9ను తీసి వేస్తారు. 6.5-5.9 = 0.600గా వస్తుంది. ఇదే ఆ జట్టు నెట్ రన్ రేట్. (PC : TWITTER)
8/ 8
ఒక వేళ ఒక జట్టు 260 పరుగులను 39.2 ఓవర్లకు చేస్తే.. అప్పుడు 260 పరుగులను 39.33 ఓవర్లతో భాగిస్తారు. ఒక ఓవర్ కు 6 బంతులు ఉంటాయి. 2 బంతులకు .33 శాతంగా (దాదాపుగా) తీసుకుంటారు. (PC : TWITTER)