T20 World Cup 2022 : బౌలింగ్, ఫీల్డింగ్ కాదు.. టీమిండియాను భయపెడుతోన్న మరో అంశం.. లైట్ తీసుకుంటే ఇంటికి రావాల్సిందే
T20 World Cup 2022 : బౌలింగ్, ఫీల్డింగ్ కాదు.. టీమిండియాను భయపెడుతోన్న మరో అంశం.. లైట్ తీసుకుంటే ఇంటికి రావాల్సిందే
T20 World Cup 2022 : చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈ నెల 23న జరిగే మ్యాచ్ తో భారత్ తన ప్రపంచకప్ టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఇక ఈ ప్రపంచకప్ కోసం భారత్ ఈ ఏడాది నుంచే ప్రిపేర్ అయ్యింది.
అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది. 15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న టి20 ప్రపంచకప్ ను ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలగా టీమిండియా (Team India) ఉంది.
2/ 8
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈ నెల 23న జరిగే మ్యాచ్ తో భారత్ తన ప్రపంచకప్ టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఇక ఈ ప్రపంచకప్ కోసం భారత్ ఈ ఏడాది నుంచే ప్రిపేర్ అయ్యింది.
3/ 8
స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా టి20 సిరీస్ లను ఆడింది. ప్రతి సిరీస్ లోనూ భారతే విజేతగా నిలిచింది. ఇక ఇటీవలె స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగిన టి20 సిరీస్ ల్లోనూ భారత్ ఘనవిజయం సాధించింది.
4/ 8
అయితే బుమ్రా గాయంతో తప్పుకోవడం భారత్ ను బాధించే అంశం. అయినా కూడా పేపర్ మీద మాత్రం టీమిండియా చాలా భయంకరంగా కనిపిస్తుంది.
5/ 8
ఇక డెత్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కాస్త మెరుగుపడితే టీమిండియాకు టి20 ప్రపంచకప్ లో తిరుగులేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడే ఒక అంశాన్ని విస్మరిస్తున్నారు.
6/ 8
ఆస్ట్రేలియా గ్రౌండ్స్ భారత మైదానాల కంటే కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. ఇండియాలో బౌండరీల సైజ్ (పిచ్ నుంచి)లు 70 మీటర్లలోపే ఉంటాయి. అదే ఆస్ట్రేలియాలో అయితే 70 నుంచి 80 మీటర్ల మధ్య ఉంటుంది. (PC : TWITTER)
7/ 8
ఈ క్రమంలో ఇండియాలో సిక్సర్లుగా మారినవి ఆస్ట్రేలియాలో క్యాచ్ లు గా మారే అవకాశం ఉంది. దీనిని గుర్తించుకుని భారత్ ప్లేయర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా తేడా జరిగితే ఇక్కడ సిక్సర్ల వర్షం కురిపించిన భారత ప్లేయర్లు ఆసీస్ గ్రౌండ్స్ లో మాత్రం జీరోలుగా మారే అవకాశం ఉంది. (PC : TWITTER)
8/ 8
PC : ఈ క్రమంలో ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత టీం రెండు గ్రూపులుగా విడిపోయి.. వాకా పిచ్ పై కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడితే మంచిది. అప్పుడే మనకు పిచ్ లతో పాటు బౌండరీలను క్లియర్ చేసే అంశాలపై ఒక అవగాహన వస్తుంది.