IND vs ZIM : టీమిండియాలో ‘శూర్-వీర్’తడాఖా.. విజయాల్లో వీరిదే సింహ భాగం.. ఎవరంటే?
IND vs ZIM : టీమిండియాలో ‘శూర్-వీర్’తడాఖా.. విజయాల్లో వీరిదే సింహ భాగం.. ఎవరంటే?
IND vs ZIM : జింబాబ్వేపై నెగ్గితే భారత్ గ్రూప్ ‘2’ విన్నర్ హోదాలో సెమీఫైనల్ కు చేరుకుంటుంది. ఈ క్రమంటో జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో అదరగొట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) సెమీఫైనల్ కు చేరేందుకు ఉన్న చివరి అడ్డంకిని దాటేందుకు సిద్ధమైంది. ఆదివారం జింబాబ్వే (Zimbabwe)తో జరిగే మ్యాచ్ లో భారత్ నెగ్గితే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ కు చేరుతుంది. (PC : TWITTER)
2/ 9
జింబాబ్వేపై నెగ్గితే భారత్ గ్రూప్ ‘2’ విన్నర్ హోదాలో సెమీఫైనల్ కు చేరుకుంటుంది. ఈ క్రమంటో జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో అదరగొట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. (PC : TWITTER)
3/ 9
అయితే ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ నుంచి కూడా భారత విజయాల్లో ఇద్దరి పాత్రే ఎక్కువగా కనిపిస్తుంది. వారే సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ. ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. (PC : TWITTER)
4/ 9
ఇక ఆరంభంలో ఫామ్ లో లేక ఇబ్బంది పడ్డ విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ ద్వారా ఫామ్ లోకి వచ్చాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ వెనుదిరిగి చూడటం లేదు. తమ ఆటతో అనేక పర్యాయాలు టీమిండియాను గెలిపించారు. (PC : TWITTER)
5/ 9
ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ నుంచి చూసుకుంటే భారత్ గెలిచిన మ్యాచ్ ల్లో వీరి పాత్రే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచకప్ లో భారత్ ఇప్పటి వరకు (నవంబర్ 5) నాలుగు మ్యాచ్ లు ఆడితే అందులో మూడుసార్లు నెగ్గింది. మరో దాంట్లో ఓడింది. (PC : TWITTER)
6/ 9
ఈ మూడు పర్యాయాలలో రెండు సార్లు (నెదర్లాండ్స్, బంగ్లాదేశ్)లపై గెలవడానికి కోహ్లీ, సూర్యకుమార్ లు నెలకొల్పిన భాగస్వామ్యాలే కీలకం. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడినా సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. (PC : TWITTER)
7/ 9
ఇక పాకిస్తాన్ పై గెలిచిన మ్యాచ్ లో కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. వీరిద్దరినీ తీసేసి చూస్తే టీమిండియా పరిస్థితి పేలవంగా కనిపిస్తుంది. టీమిండియా బ్యాటింగ్ కు ఆయువుపట్టుగా కోహ్లీ, సూర్యకుమార్ లు ఉన్నారు. (PC : TWITTER)
8/ 9
కోహ్లీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ ల్లో 220 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 4 మ్యాచ్ ల్లో 164 పరుగులు చేశాడు. (PC : TWITTER)
9/ 9
వీరిద్దరినీ కలిపి టీమిండియా అభిమానులు ‘శూర్-వీర్’గా పిలుచుకుంటున్నారు. ఇదే ఫామ్ ను సూర్యకుమార్, కోహ్లీ కొనసాగిస్తే భారత్ కప్పు గెలవడం ఖాయం. (PC : TWITTER)