టీ20 ప్రపంచకప్ లో వరుణుడు అంతరాయం కొనసాగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2022 సందడికి వరుణుడు బ్రేకులు వేస్తున్నాడు. కీలక సమయంలో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ తో పాటు అన్ని జట్లకు అడ్డంకిగా మారాడు. అందరూ టీ20 వరల్డ్ కప్ ఎలా జరుగుతుంది, ఏంటని చూడట్లేదు. ఏ మ్యాచ్ జరుగుతుందా? దాన్ని చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అలా ఉంది మరి పరిస్థితి. (PC : Twitter)
ఉదహరణకు అక్టోబర్ 26 అంటే బుధవారం వరుణుడిదే పై చేయి గా మారింది. ఫస్ట్ మ్యాచులో ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లి.. ఐర్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ మెల్ బోర్న్ గ్రౌండ్ లో జరిగింది. ఇక, అదే రోజు జరగాల్సిన రెండో మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. అఫ్గానిస్తాన్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది.
మరోవైపు.. ఈ వర్షం ఎఫెక్ట్ తో పెద్ద జట్లన్నీ తెగ భయపడిపోతున్నాయి. ఇందుకు కారణం ఉంది. వర్షం వల్ల గెలిచే మ్యాచుల్లో కూడా ఫలితాలు మారిపోతున్నాయి. ఇందుకు ఎగ్జాంపుల్ ఇంగ్లండ్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్. డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం ఇంగ్లండ్ పై ఐదు పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది ఐర్లాండ్. మ్యాచ్ ఆసాంతం జరిగి ఉంటే ఇంగ్లండ్ నే విజయం వరించి ఉండేదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి క్రీజులో మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ వంటి డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు. ఆ తర్వాత క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ వంటి నాణ్యమైన ఆల్ రౌండర్లు ఉన్నారు. కానీ, ఇంగ్లండ్ ఆశలన్నీ నీటి పాలయ్యాయి. ఇక, సౌతాఫ్రికా కూడా తమ ఫస్ట్ మ్యాచులో జింబాబ్వేపై కచ్చితంగా గెలిచేది. కానీ, వారి ఆశలకు కూడా వరుణుడు బ్రేకులు వేశాడు.