T20 World Cup 2022 : టీమిండియాకు బిగ్ షాక్.. ఆ ప్లేయర్ కు నడుం గాయం.. తర్వాతి మ్యాచ్ లు ఆడేది అనుమానమే
T20 World Cup 2022 : టీమిండియాకు బిగ్ షాక్.. ఆ ప్లేయర్ కు నడుం గాయం.. తర్వాతి మ్యాచ్ లు ఆడేది అనుమానమే
T20 World Cup 2022 : ఇక మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్, ఫీల్డింగ్ దారుణంగా విఫలం అయ్యింది. బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడకుంటే భారత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఓటమితో డీలా పడ్డ భారత్ కు మరో షాక్ తగిలింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India)కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో నెగ్గి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన రోహిత్ సేనకు సౌతాఫ్రికా (South Africa) చేతిలో షాక్ తగిలింది. (PC : TWITTER)
2/ 8
సూపర్ 12లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్ పై నెగ్గింది. దాంతో పాయింట్ల పట్టికలో సఫారీ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఓటమితో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. (PC : TWITTER)
3/ 8
ఇక మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్, ఫీల్డింగ్ దారుణంగా విఫలం అయ్యింది. బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడకుంటే భారత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఓటమితో డీలా పడ్డ భారత్ కు మరో షాక్ తగిలింది. (PC : TWITTER)
4/ 8
వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ నడుం గాయం బారిన పడ్డాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా వేసిన బౌన్సర్ ను ఆపే ప్రయత్నంలో కార్తీక్ గాల్లోకి చాలా ఎత్తుకు ఎగిరాడు. అనంతరం ల్యాండ్ అయ్యే సమయంలో అతడి నడుం బాగం బెణికినట్లు తెలుస్తుంది. (PC : TWITTER)
5/ 8
అనంతరం అతడు కీపింగ్ చేయకుండా మైదానాన్ని వదిలాడు. కార్తీక్ స్థానంలో పంత్ చివరి ఓవర్లలో టీమిండియా కీపర్ గా వ్యవహరించాడు. మెగా టోర్నీలో కార్తీక్ పెద్దగా బ్యాట్ తో మెరవలేదు. పాక్ తో మ్యాచ్ లో ఒక్క పరుగు మాత్రమే చేసిన అతడు.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు మాత్రమే చేశాడు. (PC : TWITTER)
6/ 8
అయితే కీపర్ గా మాత్రం సత్తా చాటుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బవుమా ఇచ్చిన కష్ట సాధ్యమైన క్యాచ్ ను అందుకోవడంతో పాటు డేంజరస్ బ్యాటర్ రోసో ఎల్బీ రివ్యూ విషయంలో కీలక పాత్ర పోషించాడు. (PC : TWITTER)
7/ 8
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్తీక్ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండేది అనుమానమే. అతడి స్థానంలో పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. (PC : TWITTER)
8/ 8
ఇక టోర్నీలో రోహిత్, కేఎల్ రాహుల్ ఫామ్ కూడా కలవర పెడుతుంది. వీరిద్దరూ ఓపెనర్లుగా విఫలం అవుతున్నారు. శుభారంభాలు అందించలేకపోతున్నారు. ఇక పవర్ ప్లేలో కూడా టీమిండియా పేలవంగా బ్యాటింగ్ చేస్తుంది. (PC : TWITTER)