మరోవైపు, దక్షిణాఫ్రికా యొక్క మిగిలిన మ్యాచ్‌లు భారత్, పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్‌తో ఉన్నాయి. నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెదర్లాండ్స్‌పై ఆఫ్రికా గెలిచి.. భారత్-పాకిస్థాన్ జట్ల చేతిలో ఓడిపోతే, వారి ఖాతాలో గరిష్టంగా 5 పాయింట్లు ఉంటాయి. అప్పుడు పాక్ కే అవకాశాలు ఉంటాయి.
మరోవైపు.. జింబాబ్వే కూడా కనీసం రెండు మ్యాచుల్లో ఓడిపోవాలి. జింబాబ్వే నెక్ట్స్ నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ మరియు టీమిండియాలతో తలపడనుంది. ఈ మూడు జట్లలో టీమిండియా కఠిన ప్రత్యర్థి. మిగతా రెండు గేమ్స్ లో కష్టపడితే జింబాబ్వే గెలిచే అవకాశం ఉంది. అప్పుడు జింబాబ్వే చేతిలో గరిష్టంగా ఏడు పాయింట్లు చేరుతాయి. అప్పుడు పాక్ ఇంటికి చేరినట్టే.