దీంతో రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని జట్టు గ్రూప్-2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే ఈ ఓటమిని బంగ్లా జట్టు జీర్ణించుకోలేకపోతోంది. ఈ మ్యాచ్ తర్వాత వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడం, ఫేక్ ఫీల్డింగ్.. అని బంగ్లా అభిమానులు, ఆటగాళ్లు సాకులు చెప్పడం మనపై ఏడవ్వడం చూశాం. ఈ విక్టరీతో దాయాది పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఐసీసీ ఒత్తిడితోనే ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని చెప్పాడు. భారత్‌ను ఎలాగైన సెమీస్ ఆడించాలనే ఉద్దేశంతోనే ఐసీసీ ఇలా వ్యవహరించిందన్నాడు.