T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ లో టీమిండియా సిక్సర్ల వీరులు వీరే.. ధోని ఎన్నో స్థానంలో ఉన్నాడంటే?
T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ లో టీమిండియా సిక్సర్ల వీరులు వీరే.. ధోని ఎన్నో స్థానంలో ఉన్నాడంటే?
T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ ఈ నెల 16 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి 7 సార్లు టి20 ప్రపంచకప్ జరగ్గా.. ఇందులో భారత్ 2007లో జరిగిన టి20 ప్రపంచకప్ లో నెగ్గింది. ఇక టి20 ప్రపంచకప్ లలో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు ఎవరో చూద్దాం.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఆరంభం అవ్వడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ టి20 ప్రపంచకప్ జరగనుంది. (PC : ICC/TWITTER)
2/ 8
తొలుత గ్రూప్ మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 16 నుంచి 22 వరకు సూపర్ 12లో స్థానం కోసం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి. ఇందులో టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సూపర్ 12కు చేరుకుంటాయి.
3/ 8
ఇక భారత్ విషయానికి వస్తే తన తొలి మ్యాచ్ ను అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు 7 టి20 ప్రపంచకప్ లు జరగ్గా.. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
4/ 8
ఈ జాబితాలో సిక్సర్ల కింగ్, భారత మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. టి20 ప్రపంచకప్ లో 31 మ్యాచ్ లు ఆడిన యువరాజ్ సింగ్ 33 సిక్సర్లు బాదాడు. టి20 ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్ గా యువరాజ్ సింగ్ ఉన్నాడు.
5/ 8
ఇక రెండో స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ 33 మ్యాచ్ ల్లో 31 సిక్సర్లు బాదాడు. ఇక 2022 టి20 ప్రపంచకప్ లో కూడా రోహిత్ ఆడుతుండటంతో యువరాజ్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంలా కనిపిస్తుంది.
6/ 8
విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 21 మ్యాచ్ ల్లో 20 సిక్సర్లు బాదాడు. ఆసియా కప్ ముందు వరకు కూడా పూర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. టి20 ప్రపంచకప్ లో మిడిల్ ఓవర్స్ లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
7/ 8
ధోని నాలుగో స్థానంలో ఉన్నాడు. 33 మ్యాచ్ ల్లో అతడు 16 సిక్సర్లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ లో సాధించనట్లు టి20 ప్రపంచకప్ లో మాత్రం ధోని సిక్సర్లు బాదలేకపోయాడు.
8/ 8
ఇక సురేశ్ రైనా ఐదో స్థానంలో ఉన్నడు. సురేశ్ రైనా 26 మ్యాచ్ ల్లో 12 సిక్సర్లు బాదాడు. ఇక కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు టి20 ప్రపంచకప్ జట్టులో ఉండటంతో వీరు ధోని, సురేశ్ రైనా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది.