T20 World Cup 2022 : మెగా టోర్నీలో అండర్ డాగ్ గా ఆసియా టీం.. ఫేవరెట్లకు షాకిస్తుందా?
T20 World Cup 2022 : మెగా టోర్నీలో అండర్ డాగ్ గా ఆసియా టీం.. ఫేవరెట్లకు షాకిస్తుందా?
T20 World Cup 2022 : ఇక టోర్నీలో హాట్ ఫేవరెట్స్ గా భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు బరిలో ఉన్నాయి. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు తమను తక్కువ అంచనా వేస్తే బాధపడాల్సి వస్తుందని ఇతర జట్లకు హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు ప్రపంచకప్ లో తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. ఐర్లాండ్, యూఏఈ, స్కాట్లాండ్, నమీబియా లాంటి జట్లను మినహాయించాల్సి ఉంటుంది.
2/ 8
ఇక టోర్నీలో హాట్ ఫేవరెట్స్ గా భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు బరిలో ఉన్నాయి. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు తమను తక్కువ అంచనా వేస్తే బాధపడాల్సి వస్తుందని ఇతర జట్లకు హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.
3/ 8
అయితే ఈ టోర్నీలో ఒక జట్టు అండర్ డాగ్ గా బరిలోకి దిగనుంది. ఆసియాకు చెందిన ఈ జట్టు నేరుగా సూపర్ 12కు అర్హత సాధించలేదు. దేశంలో సంక్షోభంతో పాటు గతి తప్పిన ఆటతో మొన్నటి వరకు కూడా శ్రీలంక జట్టు కఠిన పరిస్థితులను ఎదుర్కొంది.
4/ 8
అయితే నెల రోజుల క్రితం జరిగిన ఆసియా కప్ టోర్నీలో ఫేవరెట్స్ భారత్, పాకిస్తాన్ జట్లకు షాకిచ్చిన శ్రీలంక జట్టు ఏకంగా చాంపియన్ గా నిలిచింది. ఆ టోర్నీలో అఫ్గానిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో దారుణంగా ఓడిన శ్రీలంక ఆ తర్వాత అద్భుత రీతిలో కమ్ బ్యాక్ చేసి చాంపియన్ గా నిలిచింది.
5/ 8
ఇక టి20 ప్రపంచకప్ లో కూడా ఎటువంటి అంచనాలు లేకుండా శ్రీలంక బరిలోకి దిగనుంది. దాసున్ శనక నాయకత్వంలోని శ్రీలంక జట్టు సమష్టిగా ఆడుతూ విజయాలను అందుకుంటుంది. స్టార్ ప్లేయర్స్ లేకపోయినా బ్రదర్స్ లా ఆడుతూ విజయాలను సాధిస్తున్నారు.
6/ 8
ఇప్పటి శ్రీలంక జట్టును చూస్తుంటే 2007 టి20 ప్రపంచకప్ లోని టీమిండియా గుర్తు రాక మానదు. అప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్ ఏకంగా చాంపియన్ గా నిలిచింది.
7/ 8
శ్రీలంక తన టి20 ప్రపంచకప్ వేటను అక్టోబర్ 16న నమీబియాతో జరిగే మ్యాచ్ తో ఆరంభిస్తుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న శ్రీలంక నమీబియా, నెదర్లాండ్స్, యూఈఏలతో పోటీ పడనుంది. గ్రూప్ దశను దాటడం శ్రీలంకకు సులభమైన విషయమే.
8/ 8
గ్రూప్ ‘ఎ’ టాపర్ గా శ్రీలంక నిలిస్తే సూపర్ 12లో నంబర్ 1 గ్రూప్ లోకి చేరుతుంది. అక్కడ ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది.