Rohit Sharma : ‘టి20 ప్రపంచకప్ కంటే కూడా బుమ్రాకు అదే ముఖ్యం’ హిట్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma : ‘టి20 ప్రపంచకప్ కంటే కూడా బుమ్రాకు అదే ముఖ్యం’ హిట్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma : ఇక భారత్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)తో ఆడనుంది. అయితే దీని కంటే కూడా ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ లను ఆడనుంది. అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో.. అక్టోబర్ 19న న్యూజిలాండ్ తో ప్రాక్టీస్ చేయనుంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభమైంది. అక్టోబర్ 16 నుంచి 22 వరకు 8 జట్ల మధ్య గ్రూప్ దశ జరగనుంది. ఇక 22 నుంచి ప్రధాన దశ అయిన సూపర్ 12 ఆరంభం కానుంది.
2/ 8
ఇక భారత్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)తో ఆడనుంది. అయితే దీని కంటే కూడా ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ లను ఆడనుంది. అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో.. అక్టోబర్ 19న న్యూజిలాండ్ తో ప్రాక్టీస్ చేయనుంది.
3/ 8
అయితే ఈ టోర్నీ నుంచి భారత స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గాయం నుంచి తప్పుకున్న సంగతి తెలిందే. బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా అతడు మెగా టోర్నీకి దూరమయ్యాడు.
4/ 8
ఇక బుమ్రా స్థానంలో మొహమ్మద్ షమీని టి20 ప్రపంచకప్ ప్రధాన జట్టులోకి చేర్చింది. ఇక టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు 16 మంది కెప్టెన్లతో కార్యక్రమం జరిగింది.
5/ 8
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన వరకు బుమ్రాకు ఈ ప్రపంచకప్ కంటే కూడా అతడి కెరీరే ముఖ్యమని వ్యాఖ్యానించాడు.
6/ 8
టి20 ప్రపంచకప్ అని బుమ్రాను గాయంతోనే ఆడించలేమన్న అతడు.. అలా చేస్తే బుమ్రా కెరీర్ నాశనం అయ్యే ఛాన్స్ ఉందన్నాడు. బుమ్రాకు ప్రస్తుతం విశ్రాంతి అవసరమని.. అతడు కోలుకుంటే ఇటువంటి ప్రపంచకప్ లు ఎన్నో ఆడతాడని కూడా రోహిత్ పేర్కొన్నాడు.
7/ 8
ఇక మితిమీరిన ఐపీఎల్ మ్యాచ్ ల వల్లే బుమ్రా గాయపడ్డాడని టీమిండియా అభిమానుల్లోని ఒక వర్గం వాదిస్తోంది. ఐపీఎల్ నాటికి కోలుకోవడం.. ఆ తర్వాత ఐసీసీ టోర్నీ సమయానికి మళ్లీ గాయపడటం బుమ్రాకు అలవాటే అంటూ చాలా మంది అంటున్నారు.
8/ 8
ఇక 2007లో తొలిసారి జరిగిన టి20 ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలిచిన టీమిండియా మళ్లీ అటువంటి ఘనతను రిపీట్ చేయలేకపోయింది. ఈసారి 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉంది.