ఈ జాబితాలో మొహమ్మద్ షమీ కూడా ఉన్నాడు. వాస్తవానికి అతడు ఈ ప్రపంచకప్ లోనే ఆడాల్సింది కాదు. అయితే ప్రసిధ్ గాయపడటం.. అవేశ్ ఖాన్ పూర్ ఫామ్.. చివర్లో బుమ్రా మళ్లీ గాయపడటం వంటి అంశాలతో షమీ టి20 ప్రపంచకప్ లో చోటు దక్కించుకున్నాడు. వయసు 32 ఏళ్లే అయినా అతడు ఈ ప్రపంచకప్ తర్వాత టెస్టు, వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కూడా ఇదే ఆఖరి ప్రపంచకప్ కావొచ్చు. ఈ వార్త అతడి అభిమానులకు మింగుడు పడకపోవచ్చు. అయితే ప్రస్తుతం రోహిత్ వయసు 35 ఏళ్లు. ఆట పరంగా రోహిత్ ను పక్కన పెట్టే ఛాన్స్ లేదు. అయితే గాయాలు, ఫిట్ నెస్ సమస్యలు అతడికి ప్రతికూలంగా ఉన్నాయి. ఫిట్ నెస్ పై మరింత్ర శ్రద్ధ పెడితే రోహిత్ 2024 ప్రపంచకప్ బరిలో ఉండే అవకాశం ఉంది.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఫిట్ గా ఉండే కోహ్లీ వచ్చే టి20 ప్రపంచకప్ లో ఎందుకు ఆడడు అని అతడి అభిమానులు ప్రశ్నించవచ్చు. ఈ ప్రపంచకప్ తర్వాత కోహ్లీ, జడేజాలపై ట్రాన్సిషన్ పద్ధతి అమలు చేసే అవకాశం ఉంది. అంటే కోహ్లీ కూడా ధావన్ లా ఒకటి లేదా రెండు ఫార్మాట్ లకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో వచ్చే టి20 ప్రపంచకప్ లో కోహ్లీ ఆడేది అనుమానమే.