టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన థ్రిల్లర్ పోరులో టీమిండియా (Team India) 4 వికెట్లతో నెగ్గిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్ షోతో చెలరేగిపోయాడు.
2/ 8
15 ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది ఎలాగైనా తెరదించి టి20 ప్రపంచకప్ చాంపియన్ గా అవతరించాలనే పట్టుదలతో టీమిండియా ఈ టోర్నీలో అడుగుపెట్టింది.
3/ 8
పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించినా.. కొన్ని బలహీనతలు అయితే కనిపించాయి. ఇందులో ఓపెనర్లు విఫలం అవ్వడంతో పాటు బౌలింగ్ కూడా ఉంది.
4/ 8
ఆరంభంలో పిచ్ పై ఉన్న పచ్చికను ఉపయోగించుకున్న భారత్ బౌలర్లు పాక్ బ్యాటర్లను హడలెత్తించారు. పాక్ వెన్నెముకగా ఉన్న ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ్ లను తొందరగా అవుట్ చేశారు.
5/ 8
తొలి 10 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం 60 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది. అయితే ఇక్కడి నుంచే టీమిండియా బౌలింగ్ లయ తప్పింది.
6/ 8
ఇఫ్తికర్ అహ్మద్ తో పాటు షాన్ మసూద్ లు అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ లాంటి బౌలర్లు కూడా సిక్సర్లు బాదారు. చివరి 10 ఓవర్లలో భారత్ ఏకంగా 99 పరుగులను ప్రత్యర్థులకు సమర్పించుకుంది.
7/ 8
ఇక ఈ మ్యాచ్ లోనూ భారత్ ను 19వ ఓవర్ ఫోబియా వెంటాడింది. 19వ ఓవర్ ను అర్ష్ దీప్ సింగ్ వేయగా.. ఒక సిక్స్, ఒక ఫోర్ తో పాటు మొత్తంగా 14 పరుగులను పాకిస్తాన్ సాధించింది.
8/ 8
టి20 ప్రపంచకప్ లో మనం టైటిల్ రేసులో ఉండాలంటే బౌలింగ్ మెరుగవ్వాల్సి ఉంది. దాంతో పాటు భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ కూడా నిలకడగా పరుగులు సాధించాల్సి ఉంది.