టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 క్లైమ్యాక్స్ కు చేరుకుంది. సూపర్ 12 దశ నవంబర్ 6తో ముగియనుంది. నవంబర్ 6న జరిగే భారత్, జింబాబ్వే మ్యాచ్ తో సూపర్ 12 దశకు తెర పడనుంది. సూపర్ 12 దశ ఆఖరి దశకు చేరుకున్నా ఇక, సెమీఫైనల్ జట్లపై క్లారిటీ రాలేదు. అయితే, ఇవాళ ఐర్లాండ్ ను ఓడించడంతో న్యూజిలాండ్ దాదాపు సెమీస్ లోకి అడుగుపెట్టింది.
అంతకుముందు వర్షం కారణంగా ఇంగ్లండ్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. జింబాబ్వేతో దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. వర్షం కారణంగా అఫ్గానిస్థాన్ జట్టు తీవ్రంగా నష్టపోయింది. భారీ వర్షం కారణంగా అఫ్గాన్ రెండు మ్యాచులు రద్దయ్యాయి. ఇలా వర్షం వల్ల చాలా మ్యాచుల్లో ఫలితాలు మారిపోయాయి.