T20 World Cup 2022 : మురిస్తే భారీ మూల్యం తప్పదు! చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాల్సిందే
T20 World Cup 2022 : మురిస్తే భారీ మూల్యం తప్పదు! చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాల్సిందే
T20 World Cup 2022 : అయితే సూపర్ 12లో టీమిండియా ఆడిన తీరును విశ్లేషిస్తే మాత్రం స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేదనే చెప్పాలి. ఉత్కంఠగా జరిగిన రెండు మ్యాచ్ ల్లో భారత్ చివరి బంతికి నెగ్గింది. ఇక సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) సెమీఫైనల్ కు చేరువైంది. నవంబర్ 6న (ఆదివారం) ఆడే తన చివరి మ్యాచ్ లో గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.
2/ 8
అయితే సూపర్ 12లో టీమిండియా ఆడిన తీరును విశ్లేషిస్తే మాత్రం స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేదనే చెప్పాలి. ఉత్కంఠగా జరిగిన రెండు మ్యాచ్ ల్లో భారత్ చివరి బంతికి నెగ్గింది. ఇక సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది.
3/ 8
పసికూన నెదర్లాండ్స్ పై మాత్రమే ఘనవిజయం సాధించాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లపై గెలవడంలో లక్ కూడా కీలక పాత్ర పోషించింది. సూపర్ 12లో భారత్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడింటిలో నెగ్గి 6 పాయింట్లతో లీగ్ టాపర్ గా ఉంది.
4/ 8
అయితే ఈ విజయాలకు టీమిండియా జబ్బలు చరుచుకోవాల్సిన పని అయితే లేదు. టీమిండియా ఇంకా సెమీస్ కు అర్హత సాధించలేదు. సెమీస్ చేరాలంటే జింబాబ్వేతో జరిగే చివరి మ్యాచ్ లో తప్పకుండా నెగ్గాల్సిన పరిస్థితి.
5/ 8
ఈ టోర్నీలో పాకిస్తాన్ లాంటి జట్టుకే జింబాబ్వే షాకిచ్చింది. అదే సమయంలో బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో చివరి వరకు పోరాడి ఓడింది. ఈ క్రమంలో జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.
6/ 8
అధికారికంగా జింబాబ్వే సెమీస్ రేసులో ఉన్నా నాకౌట్ కు చేరడం కష్టమే. కానీ, చివరి మ్యాచ్ లో గెలిచేందుకు జింబాబ్వే ఆఖరి వరకు పోరాడే అవకాశం ఉంది. దాంతో జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.
7/ 8
జింబాబ్వే కంటే కూడా ఈ మ్యాచ్ లో భారత్ కు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది సెమీస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసే మ్యాచ్. దాంతో భారత్ పై ఒత్తడి ఉండే ప్రమాదం ఉంది.
8/ 8
గత మ్యాచ్ ల్లో వచ్చిన విజయాలను చూస్తూ మురిసిపోకుండా జింబాబ్వేపై సీరియస్ క్రికెట్ ఆడాల్సిన అవసరం టీమిండియాకు ఎంతైనా ఉంద. ముఖ్యంగా భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ లు దూకుడుగా ఆడి శుభారంభం చేయాల్సి ఉంది.