T20 World Cup 2022 : టీమిండియా బెంగంతా అతడి మీదే.. ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్న ద్రవిడ్
T20 World Cup 2022 : టీమిండియా బెంగంతా అతడి మీదే.. ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్న ద్రవిడ్
T20 World Cup 2022 : దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చేజేతులా ఓడిన భారత్.. బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో అద్భుత విజయం సాధించింది. దాంతో తమ సెమీఫైనల్ ఆశలను తన చేతిలోనే ఉంచుకుంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) జోరు మీదుంది. పాకిస్తాన్ (Pakistan), నెదర్లాండ్స్ (Netherlands)లపై నెగ్గి దూకుడు మీదున్న టీమిండియాకు సౌతాఫ్రికా (South Africa) రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎదురైంది.
2/ 9
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చేజేతులా ఓడిన భారత్.. బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో అద్భుత విజయం సాధించింది. దాంతో తమ సెమీఫైనల్ ఆశలను తన చేతిలోనే ఉంచుకుంది.
3/ 9
నవంబర్ 6న మెల్ బోర్న్ వేదికగా జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో ఒక్క పరుగు లేదా ఒక్క వికెట్ తో గెలిస్తే చాలా టీమిండియా గ్రూప్ ‘2’ టాపర్ గా టి20 ప్రపంచకప్ లో అడుగుపెడుతుంది.
4/ 9
ఇక ప్లేయర్ల విషయానికి వస్తే కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన రాహుల్ టచ్ లోకి వచ్చాడు. అయితే ఒక ప్లేయర్ విషయంలో మాత్రం భారత్ కలవరపడుతోంది.
5/ 9
అతడే రోహిత్ శర్మ. కెప్టెన్ గా జట్టును బాగా నడిపిస్తున్న రోహిత్ బ్యాటర్ గా మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 74 పరుగులు మాత్రమే చేశాడు.
6/ 9
పాకిస్తాన్ పై 4.. నెదర్లాండ్స్ పై 53.. సౌతాఫ్రికాపై 15.. బంగ్లాదేశ్ పై 2 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ పై ప్రింగిల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ అర్ధ సెంచరీ చేశాడన్న సంగతిని మరవకూడదు.
7/ 9
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ముందు వరకు కూడా రాహుల్ పూర్ ఫామ్ లో ఉన్నాడు. దాంతో భారత్ కు ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 50 ప్లస్ ఓపెనింగ్ భాగస్వామ్యం రాలేదు.
8/ 9
ఇక రోహిత్ లాంటి పవర్ హిట్టర్ ఫామ్ లో లేకపోవడం భారత్ కు ప్రతికూలంగా మారింది. రోహిత్ ఆరంభంలో ఆడలేకుండా పోతుండటంతో భారత్ 200 మార్కును అందుకోలేకపోతుంది.
9/ 9
రోహిత్ కూడా ఫామ్ లోకి వచ్చి టీమిండియాకు ధనాధన్ ఆరంభం ఇస్తే.. దానిని చివరి వరకు కొనసాగించేందుకు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు. దాంతో జింబాబ్వేతో జరిగే మ్యాచ్ తో అయినా రోహిత్ ఫామ్ లోకి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.