IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. ఈ తప్పులు చేస్తే టీమిండియా ఫసక్కే
IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. ఈ తప్పులు చేస్తే టీమిండియా ఫసక్కే
IND vs ZIM : అదే సమయంలో జింబాబ్వేను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి బలమైన జట్టుకే జింబాబ్వే షాకిచ్చింది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో చివరి బంతికి ఓడిపోయింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో టీమిండియా (Team India) కీలక పోరుకు సిద్ధమైంది. నవంబర్ 6న జింబాబ్వే (Zimbabwe)తో అమీతుమీకి సిద్ధమైంది. భారత్ ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడకుండా నేరుగా సెమీస్ చేరాలంటే జింబాబ్వేపై తప్పక నెగ్గాలి.
2/ 8
అదే సమయంలో జింబాబ్వేను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి బలమైన జట్టుకే జింబాబ్వే షాకిచ్చింది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో చివరి బంతికి ఓడిపోయింది.
3/ 8
అయితే జింబాబ్వే తన ఆఖరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. దాంతో భారత్ తో జరిగే ఆఖరి మ్యాచ్ లో గెలుపు సాధించి టోర్నీని ఘనంగా ముగించాలనే పట్టుదలతో జింబాబ్వే ఉంది.
4/ 8
ఇక్కడ మరో విషయం ఏంటంంటే.. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా జింబాబ్వేకు పెద్ద నష్టం ఉండదు. కానీ, భారత్ కు అలా కాదు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడితే సెమీస్ ఆశలు డేంజర్ లో పడే అవకాశం ఉంది.
5/ 8
దాంతో భారత్ ఈ మ్యాచ్ లో ఎటువంటి తప్పులు చేసేందుకు ఆస్కారం ఇవ్వరాదు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించాల్సి ఉంది.
6/ 8
ఇక టోర్నీలో భారత్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. అయితే ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాలే కాస్త కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏకంగా రెండు క్యాచ్ లతో పాటు మూడు రనౌట్ ఛాన్స్ లను మిస్ చేసుకుని చేజేతులా ఓడింది.
7/ 8
ఇక అదే సమయంలో బౌలింగ్ లో అర్ష్ దీప్ మాత్రమే వికెట్ టేకింగ్ బౌలర్ గా ఉంటున్నాడు. భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీలు ఇప్పటి వరకు తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయారు.
8/ 8
ఇక హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రాణించినా.. ఆ తర్వాత జరిగిన పోరుల్లో విఫలం అయ్యాడు. బౌలర్ గా వికెట్లు తీస్తున్నా ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు. ముఖ్యంగా టీమిండియా ఫీల్డింగ్ లో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించడానికి వీలు లేదు.