T20 World Cup 2022 : భువీ సెన్సేషనల్ స్పెల్.. ఏకంగా ఆ రికార్డునే సమం చేశాడు
T20 World Cup 2022 : భువీ సెన్సేషనల్ స్పెల్.. ఏకంగా ఆ రికార్డునే సమం చేశాడు
T20 World Cup 2022 : ఇక ఈ మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 44 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు కూడా అర్ధ సెంచరీలతో రాణించారు.
టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా నెదర్లాండ్స్ (Netherlands)తో జరిగిన మ్యాచ్ లో భారత్ (India) 56 పరుగులతో విజయం సాధించింది. దాంతో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి 4 పాయింట్లతో గ్రూప్ ‘2’లో టాప్ ప్లేస్ కు చేరుకుంది.
2/ 8
ఇక ఈ మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 44 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు కూడా అర్ధ సెంచరీలతో రాణించారు.
3/ 8
అనంతరం భారత బౌలర్లు అదరగొట్టారు. భువనేశ్వర్, అక్షర్ పటేల్, అశ్విన్, అర్ష్ దీప్ సింగ్ లు తలా రెండు వికెట్లతో నెదర్లాండ్స్ పతనానికి బాటలు వేశారు.
4/ 8
ఇక ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ సెన్సేషనల్ స్పెల్ తో రెచ్చిపోయాడు. 3 ఓవర్లు వేసిన అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు.
5/ 8
అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక మెయిడీన్ ఓవర్లు వేసిన బౌలర్ గా భారత స్టార్ జస్ ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అతడు 56 మ్యాచ్ ల్లో 9 మెయిడీన్ ఓవర్లు వేశాడు. ఈ రికార్డునే భువీ సమం చేశాడు.
6/ 8
నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసిన భువనేశ్వర్.. ఇందులో రెండు ఓవర్లను మెయిడీన్ లుగా ముగించాడు. దాంతో అంతర్జాతీయ టి20ల్లో 9 మెయిడీన్లు వేసిన బౌలర్ గా బుమ్రా రికార్డును సమం చేశాడు.
7/ 8
అంతేకాకుండా మరో అరుదైన ఘనతను కూడా భువీ అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు ఓవర్లను మెయిడీన్లుగా వేసిన తొలి భారత బౌలర్ గా భువనేశ్వర్ చరిత్రకెక్కాడు.
8/ 8
ఇక భారత్ తన తదుపరి పోరును ఈ నెల 30న ఆడనుంది. బౌలర్లకు స్వర్గధామంగా భావించే పెర్త్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో సౌతాఫ్రికాతో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంభం కానుంది.