T20 World Cup 2022 : సూర్య సూపర్.. రిజ్వాన్ బేజార్.. ఈ ఏడాది మనోడిదే
T20 World Cup 2022 : సూర్య సూపర్.. రిజ్వాన్ బేజార్.. ఈ ఏడాది మనోడిదే
T20 World Cup 2022 : నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 204 స్ట్రయిక్ రేట్ తో భారత్ కు భారీ స్కోరును అందించడంలో సాయపడ్డాడు.
అంతర్జాతీయ టి20ల్లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన తక్కువ స్కోరుకే అవుటైన సూర్యకుమార్.. నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో రెచ్చిపోయాడు.
2/ 8
నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 204 స్ట్రయిక్ రేట్ తో భారత్ కు భారీ స్కోరును అందించడంలో సాయపడ్డాడు.
3/ 8
ఇక ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచేందుకు పాకిస్తాన్ ఓపెనర్ మొహ్మద్ రిజ్వాన్ తో సూర్యకుమార్ యాదవ్ పోటీ పడుతున్నాడు.
4/ 8
ఈ రికార్డు ఇద్దరి మధ్య దాగుడుమూతలు ఆడుతుంది. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ జాబితాలో రిజ్వాన్ ముందున్నాడు. అయితే నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన సూర్యకుమార్ రిజ్వాన్ ను వెనక్కి నెట్టేశాడు.
5/ 8
సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో ఇప్పటి వరకు 867 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో రిజ్వాన్ (14) మరోసారి విఫలం అయ్యాడు.
6/ 8
ప్రస్తుతం రిజ్వాన్ ఈ ఏడాది టి20ల్లో 839 పరుగులు చేశాడు. వీరి మధ్య ప్రస్తుతం ఉన్న అంతరం 28 పరుగులు మాత్రమే. దాంతో ఎవరు అత్యధిక పరుగులతో ఈ ఏడాదిని ముగిస్తారో చూడాలంటే టి20 ప్రపంచకప్ ముగిసేదాకా వేచి ఉండాల్సిందే.
7/ 8
ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 56 పరుగులతో నెగ్గింది. దాంతో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్ 4 పాయింట్లతో సూపర్ 12 గ్రూప్ ‘2’లో అగ్రస్థానానికి చేరుకుంది.
8/ 8
భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 30న ఆడనుంది. బౌలర్లకు స్వర్గధామంగా భావించే పెర్త్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో సౌతాఫ్రికాతో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంభం కానుంది.