IND vs SA : దీపక్ హుడాను జట్టులోకి ఎందుకు తీసుకున్నారబ్బా? అభిమానల్లో ప్రస్తుతం బిగ్ పజిల్ ఇదే
IND vs SA : దీపక్ హుడాను జట్టులోకి ఎందుకు తీసుకున్నారబ్బా? అభిమానల్లో ప్రస్తుతం బిగ్ పజిల్ ఇదే
IND vs SA : ఇందులో దక్షిణాఫ్రికా గెలిచింది అనడం కంటే కూడా భారతే గెలిపించింది అనడం సబబు. ప్రత్యర్థి ముందు తక్కువ టార్గెట్ నే ఉంచినా భారత బౌలర్ల పుణ్యమా ఒక దశలో భారత్ గెలిచేలా కనిపించింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో దూకుడు మీదున్న టీమిండియా (Team India)కు దక్షిణాఫ్రికా (South Africa) రూపంలో బ్రేకులు పడ్డాయి. పాకిస్తాన్ (Pakistan), నెదర్లాండ్స్ (Netherlands)పై నెగ్గి జోరు మీదున్న భారత్ జట్టును సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఓడించింది.
2/ 8
ఇందులో దక్షిణాఫ్రికా గెలిచింది అనడం కంటే కూడా భారతే గెలిపించింది అనడం సబబు. ప్రత్యర్థి ముందు తక్కువ టార్గెట్ నే ఉంచినా భారత బౌలర్ల పుణ్యమా ఒక దశలో భారత్ గెలిచేలా కనిపించింది.
3/ 8
అయితే కీలక సమయాల్లో రనౌట్స్, క్యాచ్ లను డ్రాప్ చేసి విజయాన్ని దూరం చేసుకుంది. ఈ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా సౌతాఫ్రికా గ్రూప్ ‘2’లో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ రెండో స్థానానికి పడిపోయింది. (PC : TWITTER)
4/ 8
ఓటమిని అటుంచితే భారత్ అభిమానలను ఒక అంతు చిక్కని ప్రశ్న వేధిస్తోంది. అదే దీపక్ హుడా. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాను ఈ మ్యాచ్ కోసం తుది జట్టులోకి తీసుకుంది.
5/ 8
కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. ఇక బౌలర్ గా ఒక్క ఓవర్ గానీ.. ఫీల్డర్ గా క్యాచ్ గానీ పట్టలేదు. ఇక రనౌట్ లో భాగస్వామ్యం కూడా లేదు.
6/ 8
అసలు ఏ కారణం చేత దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నారో టీమిండియా అభిమానులకు అంతుచిక్కకుండా ఉంది. సౌతాఫ్రికా జట్టులో ముగ్గురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఉండటంతో అక్షర్ పటేల్ ను తప్పించింది.
7/ 8
అయితే అతడి స్థానంలో రిషభ్ పంత్ ను తీసుకుని ఉంటే బాగుండేదేమో.. కానీ, కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ మరోలా ఆలోచించారు. హుడా జట్టులో ఉంటే అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా అక్కరకు వస్తాడని అనుకున్నారు.
8/ 8
ఇక హుడా బ్యాటర్ గా విఫలం అయ్యాడు. ఇక రోహిత్ అతడికి బంతిని ఇచ్చి బౌలింగ్ చేయించే సాహసం చేయలేదు. అలాంటప్పుడు దీపక్ హుడాను ఎందుకు జట్టులోకి తీసుకున్నట్లో రోహిత్, ద్రవిడ్ సమాధానం చెబితే కానీ మనకు అర్థం కానీ పరిస్థితి.