T20 World Cup 2022 : టీమిండియా ఆపద్భాందవుడు.. కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నా అంటాడు.. అతడెవరంటే?
T20 World Cup 2022 : టీమిండియా ఆపద్భాందవుడు.. కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నా అంటాడు.. అతడెవరంటే?
T20 World Cup 2022 : అయితే గత రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియాను ఒకరిద్దరు ప్లేయర్లే ఆదుకున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ మాత్రం రాణిస్తున్నాడు. ముఖ్యంగా కీలక పోరుల్లో రోహిత్, రాహుల్ తో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ విఫలం అవుతున్నారు.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) అదరగొడుతుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి సెమీఫైనల్ కు చేరువగా వచ్చింది. మరో రెండు మ్యాచ్ ల్లో నెగ్గితే చాలు టీమిండియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లే.
2/ 8
అయితే గత రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియాను ఒకరిద్దరు ప్లేయర్లే ఆదుకున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ మాత్రం రాణిస్తున్నాడు. ముఖ్యంగా కీలక పోరుల్లో రోహిత్, రాహుల్ తో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ విఫలం అవుతున్నారు.
3/ 8
పాకిస్తాన్ తో జరిగిన కీలక పోరులో భారత్ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను కోహ్లీ ఆదుకున్నాడు.
4/ 8
హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పుతాడు. ఇక 19వ ఓవర్ ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలుస్తాడు. అంతేకాకుండా 20 ఓవర్ లో ఒక సిక్సర్ బాది జట్టుకు ఆపద్భాందవుడిలా మారతాడు.
5/ 8
ఆ మ్యాచ్ లో రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు దారుణంగా విఫలం అవుతారు. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో కూడా రాహుల్ విఫలం అయ్యాడు. రోహిత్ అర్ధ సెంచరీ చేసినా క్యాచ్ డ్రాప్ వల్ల వచ్చిన లైఫ్ తో ఆ హాఫ్ సెంచరీని చేశాడని గుర్తుంచుకోవాలి.
6/ 8
టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకుంటున్నాడు. ముఖ్యంగా ఛేజింగ్ చేసే సమయంలో.. అందుకే కోహ్లీని ఛేజ్ మాస్టర్ గా అభిమానులు కొలుస్తారు.
7/ 8
ఇక సూపర్ 12లో భాగంగా టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఈసారి కఠిన ప్రత్యర్థి సౌతాఫ్రికాతో పెర్త్ వేదికగా తలపడనుంది. పెర్త్ వికెట్ బౌన్సీగా ఉండనుంది. దాంతో బ్యాటర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు.
8/ 8
దాంతో మరోసారి విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీతో పాటు రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు కూడా తమ బ్యాట్ లకు పని చెబితే టీమిండియా మరింత బలంగా మారనుంది.