T20 World Cup 2022 : పవర్ ప్లేలో టీమిండియా మరీ ఇంత ఘోరమా! ఇలానే ఆడితే ఏదో ఒక రోజు తప్పదు భారీ మూల్యం
T20 World Cup 2022 : పవర్ ప్లేలో టీమిండియా మరీ ఇంత ఘోరమా! ఇలానే ఆడితే ఏదో ఒక రోజు తప్పదు భారీ మూల్యం
T20 World Cup 2022 : పాకిస్తాన్ తో పాటు నెదర్లాండ్స్ పై విజయాలతో గ్రూప్ ‘2’లో టాపర్ గా నిలిచింది. అయితే భారత్ తన తదుపరి మ్యాచ్ లో కఠిన ప్రత్యర్థి సౌతాఫ్రికాతో ఆడనుంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టైటిల్ ఫేవరెట్ ట్యాగ్ తో టీమిండియా (Team India) బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లే ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ అద్భుత విజయాలను సొంతం చేసుకుంది.
2/ 8
పాకిస్తాన్ తో పాటు నెదర్లాండ్స్ పై విజయాలతో గ్రూప్ ‘2’లో టాపర్ గా నిలిచింది. అయితే భారత్ తన తదుపరి మ్యాచ్ లో కఠిన ప్రత్యర్థి సౌతాఫ్రికాతో ఆడనుంది.
3/ 8
ఇక టీమిండియా అంటే ఠక్కున గుర్తొచ్చిది బ్యాటింగ్. రోహిత్, కోహ్లీ, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
4/ 8
అయితే మెగా టోర్నీలో మాత్రం భారత బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్, రాహుల్ ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దాంతో భారత్ పవర్ ప్లేలో మరీ దారుణంగా పరుగులు సాధిస్తోంది.
5/ 8
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ పవర్ ప్లే (1 నుంచి 6 ఓవర్లు)లో కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది. అంతేకాకుండా మూడు వికెట్లను కూడా కోల్పోయింది.
6/ 8
ఇక నెదర్లాండ్స్ లాంటి బలహీన జట్టుపై కూడా భారత్ పవర్ ప్లేలో పరుగులు సాధించలేకపోయింది. నెదర్లాండ్స్ మ్యాచ్ లో టీమిండియా పవర్ ప్లేలో కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. ఒక వికెట్ ను కూడా కోల్పోయింది.
7/ 8
ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ కనీసం రన్ రేట్ ను 6గా కూడా నమోదు చేయలేకపోయింది. ఇది భారత్ ను కలవరపెట్టే అంశమే. పవర్ ప్లేలో కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్ సర్కిల్ బయట ఉంటారు.
8/ 8
దీనిని ఉపయోగించుకుని బ్యాటింగ్ జట్టు బౌలింగ్ జట్టుపై పవర్ ప్లేలో భారీగా పరుగులు సాధిస్తారు. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ మాత్రం పవర్ ప్లేలో చెమటోడుస్తుంది. రాబోయే మ్యాచ్ ల్లో ఈ సమస్యను సరి చేసుకోకుంటే భారత్ భారీ మూల్యమే చెల్లించుకునే అవకాశం ఉంది.