ఇక పసికూన నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో దురదృష్టవశాత్తు అంపైర్ తప్పిదం వల్ల ఎల్బీగా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. అయితే రివ్యూ కోరుకునే అవకాశం ఉన్నా నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్స్ కాల్ ఉండొచ్చు అని చెప్పడంతో రివ్యూ తీసుకోకుండానే రాహుల్ పెవిలియన్ కు చేరుకున్నాడు.
ఈ క్రమంలో టీమిండియా అభిమానుల్లో చాలా మంది రాహుల్ ను తుది జట్టు నుంచి తప్పించాలని అభిప్రాయపడుతున్నారు. అతడి స్థానంలో పంత్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతి మ్యాచ్ లోనూ కోహ్లీ, సూర్యకుమార్ మాత్రమే ఆడాలంటే కుదరని పని. భారీ స్కోర్లు సాధించాలంటే ఓపెనర్లు శుభారంభం తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి.