T20 World Cup 2022 : ఏంది హిట్ మ్యాన్ ఇదీ.. నువ్వేనా ఆడేది.. గెలిచాం కాబట్టి సరిపోయింది.. లేకుంటే..
T20 World Cup 2022 : ఏంది హిట్ మ్యాన్ ఇదీ.. నువ్వేనా ఆడేది.. గెలిచాం కాబట్టి సరిపోయింది.. లేకుంటే..
T20 World Cup 2022 : మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా అదరగొట్టింది. తొలుత పాకిస్తాన్ పై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీని సాధిస్తే.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో మంచి విజయాన్ని సాధించింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) కీలక దశకు చేరుకుంది. సెమీస్ చేరాలంటే అన్ని జట్లుకు కూడా ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా కీలకం కానున్నాయి. టీమిండియా (Team India) ఇందుకు మినహాయింపు కాదు.
2/ 9
మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా అదరగొట్టింది. తొలుత పాకిస్తాన్ పై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీని సాధిస్తే.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో మంచి విజయాన్ని సాధించింది.
3/ 9
దాంతో భారత్ నాలుగు పాయింట్లతో సూపర్ 12 గ్రూప్ ‘2’ టేబుల్ లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే టీమిండియాను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. అందులో ప్రధానమైనది ఓపెనింగ్ సమస్య.
4/ 9
కేఎల్ రాహుల్ తో పాటు రోహిత్ శర్మ కూడా పేలవంగా ఆడుతున్నారు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
5/ 9
అయితే రోహిత్ లాంటి స్టార్ ప్లేయర్ నుంచి ఆశించిన ఇన్నింగ్స్ అయితే ఇది కాదు. బంతిని మిడిల్ చేయడంలో రోహిత్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ప్రింగిల్ క్యాచ్ ను డ్రాప్ చేయడంతో రోహిత్ బతికిపోయిన విషయాన్ని మరిచిపోకూడదు.
6/ 9
ఒకవేళ ప్రింగిల్ క్యాచ్ పట్టి ఉంటే రోహిత్ ఇన్నింగ్స్ ఎప్పుడో ముగిసిపోయేది. మ్యాచ్ అనంతరం రోహిత్ తన బ్యాటింగ్ పై సంతృప్తిగా లేనంటు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
7/ 9
టి20 ప్రపంచకప్ లో టీమిండియా చాంపియన్ గా నిలవాలంటే ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడాల్సి ఉంటుంది. ప్రతి మ్యాచ్ లోనూ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆడతారని అనుకోలేం.
8/ 9
ముఖ్యంగా ఓపెనర్లు శుభారంభం చేయాల్సి ఉంటుంది. అప్పుడు భారీ టార్గెట్ ను సెట్ చేసేందుకు వీలవుతుంది. మన గ్రూప్ లోనే ఉన్న సౌతాఫ్రికా బంగ్లాదేశ్ పై ఏకంగా 100కు పైగా పరుగుల తేడాతో నెగ్గింది.
9/ 9
బంగ్లాదేశ్ కంటే కూడా బలహీనమైన నెదర్లాండ్స్ పై టీమిండియా కేవలం 56 పరుగుల తేడాతోనే నెగ్గింది. ఐసీసీ టోర్నీల్లో విజయాలతో పాటు నెట్ రన్ రేట్ కూడా కీలకం అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రోహిత్ తన హిట్ మ్యాన్ ఆటను బయటకు తీయాల్సి ఉంది.