IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే?
IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే?
T20 World Cup 2022 : మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా అదరగొట్టింది. తొలుత పాకిస్తాన్ పై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీని సాధిస్తే.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో మంచి విజయాన్ని సాధించింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) కీలక దశకు చేరుకుంది. సెమీస్ చేరాలంటే అన్ని జట్లుకు కూడా ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా కీలకం కానున్నాయి. టీమిండియా (Team India) ఇందుకు మినహాయింపు కాదు.
2/ 8
మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా అదరగొట్టింది. తొలుత పాకిస్తాన్ పై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీని సాధిస్తే.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో మంచి విజయాన్ని సాధించింది.
3/ 8
ఇక అక్టోబర్ 30న కఠిన ప్రత్యర్థి సౌతాఫ్రికాతో పెర్త్ వేదికగా టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్ కు చేరువ అవుతుంది.
4/ 8
ఇక ముఖాముఖి పోరులో ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం. టి20 ఫార్మాట్ లో ఇప్పటి వరకు అయితే టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 23 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు జరిగాయి.
5/ 8
ఇందులో భారత్ 13 సార్లు విజయం సాధించింది. మరో 9 సార్లు సౌతాఫ్రికా నెగ్గింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక టి20 ప్రపంచకప్ ల్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి.
6/ 8
ఇందులో భారత్ 4 సార్లు విజయం సాధిస్తే.. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. ఏ రకంగా చూసినా టి20 ఫార్మాట్ లో భారత్ దే పైచేయిగా కనిపిస్తుంది.
7/ 8
ఇక ఇటీవలె ఈ రెండు జట్ల మధ్య భారత్ వేదికగా మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరిగింది. ఇందులో భారత్ 2-1తో సిరీస్ ను సొంతం చేసుకుంది. అలా అని సౌతాఫ్రికాను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.
8/ 8
ఈ మ్యాచ్ అక్టోబర్ 30న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంభం కానుంది. పెర్త్ వికెట్ పై బౌన్స్ ఎక్కువగా ఉండటంతో భారత బ్యాటర్లకు, సౌతాఫ్రికా సీమర్లకు మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.