IND vs SA : రాహుల్ విషయంలో అంత గుడ్డి నమ్మకమా? ఇకనైనా మేల్కొనకపోతే మన కథ కంచికే
IND vs SA : రాహుల్ విషయంలో అంత గుడ్డి నమ్మకమా? ఇకనైనా మేల్కొనకపోతే మన కథ కంచికే
IND vs SA : ఇక ఈ మెగా టోర్నీలో పూర్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేసిన రాహుల్.. నెదర్లాండ్స్ పై 9 పరుగులు మాత్రమే చేశాడు.
టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022లో టీమిండియా (Team India) తొలి ఓటమిని రుచి చూసింది. దక్షిణాఫ్రికాతో (South Africa) జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించినా.. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలు విఫలం అయ్యాయి.
2/ 8
ఇక ఈ మెగా టోర్నీలో పూర్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేసిన రాహుల్.. నెదర్లాండ్స్ పై 9 పరుగులు మాత్రమే చేశాడు.
3/ 8
ఇక సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లోనూ మరోసారి విఫలం అయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఎంగిడి బౌలింగ్ లో అవుటయ్యాడు. దాంతో ఇప్పటి వరకు టోర్నీలో రెండంకెల స్కోరును ఒక్కసారి కూడా నమోదు చేయలేకపోయాడు.
4/ 8
రాహుల్ వరుస పెట్టి విఫలం అవుతున్నా అతడిని టీమిండియా మేనేజ్ మెంట్ గుడ్డిగా నమ్ముతూ వస్తోంది. అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంది. అయినా వాటిని రాహుల్ వమ్ము చేస్తూనే ఉన్నాడు.
5/ 8
ఇకనైనా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మేల్కొనాల్సి ఉంది. అతడిని తప్పించి వేరే ప్లేయర్ కు అవకాశం ఇవ్వాల్సి ఉంది. రాహుల్ స్థానంలో పంత్ ను తీసుకుని.. రోహిత్ కు జోడీగా విరాట్ ను ఓపెనింగ్ చేయిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
6/ 8
టి20 ఫార్మాట్ లో ఓపెనింగ్ చేసిన అనుభవం కోహ్లీ సొంతం. ఆసియా కప్ లో అఫ్గానిస్తాన్ పై ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. దాంతో కోహ్లీకి ఓపెనర్ గా అవకాశం ఇస్తే మంచిది.
7/ 8
భారత్ తన తదుపరి మ్యాచ్ ల్లో బంగ్లాదేశ్, జింబాబ్వేలతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ నెగ్గితే వేరే జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్ చేరుతుంది.
8/ 8
ఈ రెండు మ్యాచ్ ల్లో ఒక దాంట్లో ఓడినా భారత్ సెమీస్ చేరే అవకాశాలు డేంజర్ లో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.