ఇక టి20 ప్రపంచకప్ జట్టు కోసం భారత్ బలమైన టీంనే ఎంపిక చేసింది. ఇటీవలె జరిగిన టి20 సిరీస్ ల్లో వీరు అద్బుతంగా రాణించారు. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. భారీ హిట్టర్లు ఉన్నారు. అయితే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు భారత్ ను కలవరపెడుతున్నాయి. ఇక టి20 ప్రపంచకప్ లో ప్రస్తుతం ఉన్న జట్టులోని బ్యాటర్ల స్ట్రయిక్ రేట్ ను ఒకసారి చూద్దాం.