క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ధనాధన్ టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022)ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని జట్లు ప్రాక్టీస్ లో నిమగ్నమైతే.. మరికొన్ని టీమ్స్.. ఇతర జట్లతో సిరీస్ లు ఆడుతూ కావాల్సినంత ప్రాక్టీస్ సంపాదించుకుంటున్నాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది.
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్.. టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఐసీసీ మెగా టోర్నీలో భారత్‌ను ఓడించడం పాక్‌కు ఇదే తొలిసారి. దాంతో ఈ విజయాన్ని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు మరిచిపోవడం లేదు.వరుస పరాజయాల తర్వాత దక్కిన ఈ విజయానికి మాకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనంటూ పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.
"ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడూ పాకిస్థాన్ అండర్ డాగ్‌గానే ఉండేది. ఒత్తిడి తీసుకొని భారత్‌తో మ్యాచుల్లో ఓడిపోతూ వచ్చేవాళ్లం. కొన్నాళ్లకు ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను ఓడించగలమా? అనే అనుమానం కూడా మాలో మొదలైంది. టీమిండియాను ఓడించలేమని చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా. అయితే గత వరల్డ్ కప్‌లో దాన్ని సాధించాం. తమను ఓడించగలదని భావిస్తుంది కాబట్టే టీమిండియా గౌరవిస్తోంది.'అంటూ రమీజ్ రాజా కామెంట్ చేశాడు.
ఈ వ్యాఖ్యలపై హుందాగా కౌంటరిచ్చాడు అశ్విన్. " ఇది క్రికెట్. రెండు దేశాల మధ్య ఫైట్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎలాంటి వారమన్న దానిపై ఆధారపడి ఉంటుంది. వారు మమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి మేం కచ్చితంగా పాక్ కు గౌరవిస్తాం. రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యా. ఈ విషయాన్ని డీల్ చేసే విధానం ఇదేనా? క్రికెట్ గేమ్‌లో గెలుపు ఓటములు సహజం. పొలిటికల్ టెన్షన్స్ కారణం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు.. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ ఆసక్తి వేరుగా ఉంటుంది. "