IND vs PAK : ‘కార్తీక్ ఒక్కడే కాదు... అతడు కూడా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండాల్సిందే’ వింత ప్రతిపాదన చేసిన దిగ్గజం
IND vs PAK : ‘కార్తీక్ ఒక్కడే కాదు... అతడు కూడా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండాల్సిందే’ వింత ప్రతిపాదన చేసిన దిగ్గజం
IND vs PAK : ఇక భారత మాజీ క్రికెటర్లు అయితే పాకిస్తాన్ తో ఆడే భారత తుది జట్టు ఇలా ఉండాలి అలా ఉండాలంటూ తమ ప్లేయింగ్ ఎలెవెన్ లను ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)తో టీమిండియా (Team India) తలపడనుంది. దాంతో ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
2/ 8
ఇక భారత మాజీ క్రికెటర్లు అయితే పాకిస్తాన్ తో ఆడే భారత తుది జట్టు ఇలా ఉండాలి అలా ఉండాలంటూ తమ ప్లేయింగ్ ఎలెవెన్ లను ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
3/ 8
ఇప్పటికే హర్భజన్ సింగ్ తన ప్లేయింగ్ ఎలెవన్ ను ప్రకటించగా.. తాజాగా ఆ జాబితాలోకి టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గావస్కర్ కూడా చేరాడు.
4/ 8
అయితే గావస్కర్ ప్లేయింగ్ ఎలెవన్ కాస్త వింతగా ఉండటం విశేషం. దానికి కారణం ప్లేయింగ్ ఎలెవెన్ లో రిషభ్ పంత్ కు చోటు ఇవ్వడమే. టి20 ఫార్మాట్ లో పంత్ ఈ మధ్య కాలంలో బాగా ఆడిన సందర్భాలు చాలా తక్కువ.
5/ 8
ఇటీవలె వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లోనూ ఓపెనర్ గా వెళ్లి విఫలం అయ్యాడు. అయితే అటువంటి పంత్ కు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ఇవ్వాలని గావస్కర్ కోరుకుంటున్నాడు.
6/ 8
దినేశ్ కార్తీక్ తో పాటు పంత్ కూడా తుది జట్టులో ఉండాలని అభిప్రాయపడ్డాడు. అయితే పంత్ ను ఎందుకు సెలెక్ట్ చేయాలో అని మాత్రం కారణం తెలుపలేదు. పంత్ ను ఆరో స్థానంలో, కార్తీక్ ను ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయించాలని హితవు పలికాడు.
7/ 8
ఇక అదే సమయంలో ముగ్గురు సీమర్లు ఇద్దరు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. ఇక స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగాలని సూచించాడు.