IND vs PAk : ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో కింగ్.. అసలైన మ్యాచ్ ల్లో జీరో.. ఇతడిని నమ్ముకుంటే టీమిండియా నట్టేట మునిగినట్లే
IND vs PAk : ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో కింగ్.. అసలైన మ్యాచ్ ల్లో జీరో.. ఇతడిని నమ్ముకుంటే టీమిండియా నట్టేట మునిగినట్లే
IND vs PAk : ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్బుతం చేసి చూపించాడు. తనను మాస్టర్ ఆఫ్ ఛేజ్ గా ఎందుకు పిలుస్తారో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా కూడా రాణించాడు.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన సూపర్ 12 పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
2/ 8
ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్బుతం చేసి చూపించాడు. తనను మాస్టర్ ఆఫ్ ఛేజ్ గా ఎందుకు పిలుస్తారో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా కూడా రాణించాడు.
3/ 8
బౌలింగ్ లో మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో కూడా హార్దిక్ మెరిశాడు. కోహ్లీతో కలిసి కీలకమైన 113 పరుగుల విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అర్ష్ దీప్, భువీ, షమీ, అశ్విన్ ఇలా ప్రతి బౌలర్ కూడా తమ వంతు పాత్ర పోషించారు.
4/ 8
అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా బలహీనతలు కూడా బయటపడ్డాయి. వీటిలో ముఖ్యమైనది రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వైఫల్యం.
5/ 8
ముఖ్యంగా కేఎల్ రాహుల్ బిగ్ స్టేజ్ లపై ఈ మధ్య కాలంలో రాణించలేకపోతున్నాడు. కీలక పోరుల్లో దారుణంగా విఫలం అవుతున్నాడు. టి20 ప్రపంచకప్ ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో అర్ధ సెంచరీలు సాధించిన రాహుల్.. కీలకమైన పాక్ తో జరిగిన పోరులో దారుణంగా విఫలం అయ్యాడు.
6/ 8
చిన్న జట్లపై పరుగులు సాధిస్తున్నా.. బలమైన జట్లపై ముఖ్యంగా కీలకమైన పోరుల్లో రాహుల్ విఫలం అవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ లో కూడా రాహుల్ కీలక పోరుల్లో విఫలం అయ్యాడు.
7/ 8
అయితే అనంతరం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన టి20 సిరీస్ ల ద్వారా టచ్ లోకి వచ్చాడు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో.. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ పోరులో అర్ధ సెంచరీలు సాధించాడు.
8/ 8
అయితే పాక్ తో జరిగిన మ్యాచ్ లో విఫలం అయ్యి మళ్లీ మొదటికి వచ్చాడు. ఇక రోహిత్ కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా రాణించింది లేదు. జట్టు నిలకడగా విజయాలు సాధించాలంటే సమష్టి ప్రదర్శన ముఖ్యం.