టీ20 వరల్డ్ కప్ -2022(T20 World Cup 2022) వేటను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) ను మట్టికరిపించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఫస్ట్ మ్యాచులో గెలిచిన టీమిండియా ఈ నెల 27 (రేపు)న నెదర్లాండ్స్ తో (India vs Netherlands) అమీతుమీ తేల్చుకోనుంది.
ఇలాంటి పరిస్థితే టీమిండియాకు ఎదురయ్యే ఛాన్సుంది. దీంతో.. నెదర్లాండ్స్ మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీమిండియా మేనేజ్ మెంట్ కూడా ఇదే ఆలోచనలో ఉంది. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే దానికి తగ్గట్టుగా ప్లాన్ బీ టీమిండియాకు ఉంటే మంచిదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, నెదర్లాండ్ మ్యాచుకు టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కన్పిస్తుంది. అయితే, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పిస్తారన్న వార్తలను రాహుల్ ద్రవిడ్ కొట్టిపారేశాడు. హార్దిక్ అన్ని మ్యాచులు ఆడాలనుకుంటున్నట్టు ద్రవిడ్ తెలిపాడు. అయితే, అక్షర్ పటేల్ స్థానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.