క్రికెట్లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను రోహిత్ శర్మ (Rohit Sharma) తన పేరిట రాసుకున్నాడు. వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాధిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. వన్డేల్లో హైయస్ట్ స్కోర్ కూడా రోహిత్ పేరు మీదే ఉంది. వన్డే ప్రపంచ కప్‌లో ఐదు సెంచరీలు చేసిన ఘనత కూడా హిట్‌మ్యాన్‌కే దక్కుతుంది.
ఇక, ఈ మ్యాచ్ ద్వారా టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా దిల్షాన్ రికార్డును సమం చేశాడు. రోహిత్ కి ఇది 35వ మ్యాచ్. దీంతో.. డ్వేన్ బ్రావో (34), షాహిద్ అఫ్రిది (34), షోయబ్ మాలిక్ (34) రికార్డులను బ్రేక్ చేశాడు. దిల్షాన్ 35 టీ20 ప్రపంచకప్ మ్యాచులు ఆడాడు. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచు ద్వారా రోహిత్ ఈ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోనున్నాడు.
సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న పోరులో టీమిండియా మంచి స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కోహ్లీ ( 44 బంతుల్లో 64 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ ( 39 బంతుల్లో 53 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.