బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. దానికి తోడు ఈ మధ్యే జరిగిన ఆసియా కప్ టీ20 నుంచి టీమిండియా ముందుగానే ఎలిమినేట్ అయ్యింది. టీ20 ప్రపంచ కప్‌లోనూ ఇలానే ఇండియా ఎగ్జిట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇండియా అద్భుతమైన ఆట ప్రదర్శనతో సెమీ-ఫైనల్‌కి చేరుకుంది. కాగా ఇంగ్లాండ్‌తో జరిగే పోరుకు ముందు 3 విషయాలను టీమ్ ఇండియా ఫ్యాన్స్ తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
* విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు : టీ20 టోర్నీకి ముందుగానే ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీ టచ్ లోకి వచ్చాడు. ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో సత్తా చాటి అసలైన కింగ్ ఎవరో మరోసారి తెలియజేశాడు. అప్పటి నుంచి ప్రత్యర్థి బౌలర్లను ఉతక బాదుడు బాదుతున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు చాలా రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లి T20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
T20Iలలో 4,000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా అవతరించడానికి అతనికి ఇంకా 42 పరుగులు అవసరం. ఫైనల్స్‌కు వెళ్లేందుకు కోహ్లీ అంతకంటే ఎక్కువ స్కోరు సాధిస్తాడని భారత అభిమానులు ఆశిస్తున్నారు. రేపు జరగబోయే సెమీఫైనల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ లేదా అంతకన్నా ఎక్కువ పరుగులతో రాణిస్తే టీమిండియా దాదాపు విజయం సాధించినట్లే.