IND vs ENG 2nd Semi Final : మరోసారి వేటకు సిద్ధమైన టీమిండియా కొదమ సింహం.. ఈసారి ఎర ఎవరంటే?
IND vs ENG 2nd Semi Final : మరోసారి వేటకు సిద్ధమైన టీమిండియా కొదమ సింహం.. ఈసారి ఎర ఎవరంటే?
IND vs ENG 2nd Semi Final : ఇప్పటికే పాకిస్తాన్ ఫైనల్ కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన పాకిస్తాన్ ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ఆఖరి ఘట్టానికి చేరుకుంది. దాదాపు నెలరోజుల పాటు క్రికెట్ అభిమానులకు వినోదం పంచిన పొట్టి మహా సంగ్రామం ఈ నెల 13న మెల్ బోర్న్ వేదికగా జరిగే ఫైనల్ పోరుతో ముగుస్తుంది. (PC : TWITTER)
2/ 8
ఇప్పటికే పాకిస్తాన్ ఫైనల్ కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన పాకిస్తాన్ ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. (PC : TWITTER)
3/ 8
ఇక అడిలైడ్ వేదికగా నవంబర్ 10వ తేదీన భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టు 13న జరిగే ఫైనల్లో పాకిస్తాన్ తో టైటిల్ కోసం పోటీ పడనుంది. (PC : TWITTER)
4/ 8
అడిలైడ్ ఓవల్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటి వరకు అడిలైడ్ ఓవల్ లో కోహ్లీ రెండు టి20 మ్యాచ్ లను ఆడాడు. 2016లో ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ ఆడితే.. తాజా ప్రపంచకప్ లో భాగంగా సూపర్ 12లో బంగ్లాదేశ్ తో రెండో మ్యాచ్ ఆడాడు. (PC : TWITTER)
5/ 8
ఇక ఆస్ట్రేలియాపై 90 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతడు.. బంగ్లాదేశ్ పై 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతర్జాతీయ టి20ల్లో అడిలైడ్ ఓవల్ లో కోహ్లీ ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం విశేషం. (PC : TWITTER)
6/ 8
అడిలైడ్ ఓవల్ లో ఆడిన రెండు అంతర్జాతీయ టి20ల్లో కోహ్లీ చేసిన మొత్తం పరుగులు 154 కావడం విశేషం. ఇక మరోసారి అడిలైడ్ లో తన ఫామ్ ను కొనసాగించేందుకు కోహ్లీ రెడీగా ఉన్నాడు. (PC : TWITTER)
7/ 8
అంటే ఈ అడిలైడ్ కొదమ సింహం ఈసారి ఇంగ్లండ్ ను వేటాడనున్నాడన్నమాట. ఇక కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, రాహుల్ కూడా మంచి టచ్ లో ఉన్నారు. వీరికి రోహిత్ కూడా తోడైతే భారత్ ను ఆపడం అంత సులభం కాదు. (PC : TWITTER)
8/ 8
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం గం. 1.30 లకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదు. ఒక వేళ వర్షంతో మ్యాచ్ జరగకపోయినా రిజర్వ్ డే రోజు జరగనుంది. (PC : TWITTER)