T20 World Cup 2022 : జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట.. అలాగే ఉంది ఈ ఇద్దరి యవ్వారం
T20 World Cup 2022 : జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట.. అలాగే ఉంది ఈ ఇద్దరి యవ్వారం
T20 World Cup 2022 : టీమిండియా విషయానికి వస్తే.. నవంబర్ 10న (గురువారం) అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్ లో ఇంగ్లండ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత్ కు ప్లస్ లతో పాటు మైనస్ లు కూడా ఉన్నాయి.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో మరో మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రెండు సెమీఫైనల్స్ మ్యాచ్ లతో పాటు ఒక ఫైనల్. ఇక భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి.
2/ 8
టీమిండియా విషయానికి వస్తే.. నవంబర్ 10న (గురువారం) అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్ లో ఇంగ్లండ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత్ కు ప్లస్ లతో పాటు మైనస్ లు కూడా ఉన్నాయి.
3/ 8
సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీలు భీకర ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరితో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా బ్యాక్ టు బ్యాక్ అర్ధ సెంచరీలతో టచ్ లోకి వచ్చాడు. ఇక బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది.
4/ 8
ఇక ఈ టి20 ప్రపంచకప్ కోసం భారత్ ఇద్దరు రెగ్యులర్ వికెట్ కీపర్లతో ఆస్ట్రేలియాకు చేరుకుంది. దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ల రూపంలో భారత్ లో ఇద్దరు నాణ్యమైన వికెట్ కీపర్ లు ఉన్నారు. కేఎల్ రాహుల్ కు కూడా కీపింగ్ చేసే సత్తా ఉంది.
5/ 8
దినేశ్ కార్తీక్ కు వికెట్ కీపింగ్ బాధ్యతతో పాటు ఫినిషర్ రోల్ కూడా ఇచ్చారు. అయితే సూపర్ 12లో ఒక్క మ్యాచ్ లో కూడా కార్తీక్ తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక్కసారి కూడా రెండంకెల మార్కును అందుకోలేకపోయాడు.
6/ 8
దాంతో కార్తీక్ ను పక్కన బెట్టి రిషభ్ పంత్ కు అవకాశం ఇవ్వాలని టీమిండియా అభిమానులు హితవు పలికారు. ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కార్తీక్ ను పక్కనబెట్టి రిషభ్ పంత్ కు తుది జట్టులో ఆడే అవకాశం ఇచ్చింది.
7/ 8
అయితే పంత్ తనకు దక్కిన అవకాశాన్ని నేలపాలు చేసుకున్నాడు. 5 బంతులు మాత్రమే ఆడి 3 పరుగులు చేసి బర్ల్ పట్టిన అద్బుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు.
8/ 8
ఒకరకంగా చెప్పాలంటే కార్తీక్, పంత్ లను కాకుండా వారి స్థానాల్లో సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్ లను టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసి ఉండాల్సిందనే అభిప్రాయాన్ని కొందరు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.