Virat Kohli : టీమిండియా ఓడినా.. కొత్త చరిత్ర లిఖించిన కింగ్ కోహ్లీ.. తొలి ఆటగాడిగా ఎవరికీ సాధ్యం కాని రికార్డ్
Virat Kohli : టీమిండియా ఓడినా.. కొత్త చరిత్ర లిఖించిన కింగ్ కోహ్లీ.. తొలి ఆటగాడిగా ఎవరికీ సాధ్యం కాని రికార్డ్
IND vs ENG : సూపర్ 12లో అద్భుతంగా ఆడి గ్రూప్ 2 టాపర్ హోదాలో సెమీస్ లో అడుగుపెట్టిన టీమిండియా ఇంత పేలవంగా ఆడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇది సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేని విషయంగా మారింది.
టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కు మరోసారి నిరాశే మిగిలింది. కీలకమైన సెమీఫైనల్లో చిత్తు చిత్తుగా ఓడింది. భారత్ పై 10 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్ ఫైనల్ కు చేరుకుంది.
2/ 8
సూపర్ 12లో అద్భుతంగా ఆడి గ్రూప్ 2 టాపర్ హోదాలో సెమీస్ లో అడుగుపెట్టిన టీమిండియా ఇంత పేలవంగా ఆడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇది సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేని విషయంగా మారింది.
3/ 8
సెమీఫైనల్లో ప్రత్యర్థికి ఏ మాత్రం ఫైట్ ఇవ్వకుండానే భారత్ చేతులెత్తేసింది. ఇక భారత్ సెమీస్ లో ఓడిపోవడానికి ముఖ్య కారణం భారత ఓపెనింగ్ అని చెప్పవచ్చు.
4/ 8
టీమిండియా ఓటమిని అటు ఉంచితే.. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మ్యాచ్ లో కోహ్లీ 40 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్ లో కోహ్లీకి ఇది నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం.
5/ 8
ఈ మ్యాచ్ లో కోహ్లీ 42వ పరుగు పూర్తి చేయగానే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్ గా కోహ్లీ కొత్త చరిత్ర నెలకొల్పాడు.
6/ 8
కోహ్లీ 107 ఇన్నింగ్స్ ల్లో 4,008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ 37 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ ఉన్నాడు.
7/ 8
4 వేల పరుగుల మైలురాయికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దగ్గరగా ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్ 140 ఇన్నింగ్స ల్లో 3,853 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.
8/ 8
మరో 147 పరుగులు చేస్తే రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ప్లేయర్ గా నిలిచే అవకాశం ఉంది.