IND vs ENG 2nd Semi Final : టీమిండియా మాస్ మహారాజ్.. బరిలోకి దిగాడంటే బౌలర్లు ప్యాంట్లు తడపాల్సిందే!
IND vs ENG 2nd Semi Final : టీమిండియా మాస్ మహారాజ్.. బరిలోకి దిగాడంటే బౌలర్లు ప్యాంట్లు తడపాల్సిందే!
IND vs ENG 2nd Semi Final : గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ తో పాటు ఇంగ్లండ్.. గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. నవంబర్ 9న కివీస్, పాక్ జట్ల మధ్య.. నవంబర్ 10న ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య సెమీఫైనల్స్ మ్యాచ్ లు జరగనున్నాయి.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 చివరి స్టేజ్ కు చేరుకుంది. వచ్చే ఆదివారం జరిగే ఫైనల్ పోరుతో ఈ టి20 ప్రపంచకప్ కు ఎండ్ కార్డు పడనుంది. 16 జట్లతో అక్టోబర్ 16న ఆరంభమైన ఈ పొట్టి మహాసంగ్రామం.. ప్రస్తుతం నాలుగు జట్లకు చేరుకుంది.
2/ 8
గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ తో పాటు ఇంగ్లండ్.. గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. నవంబర్ 9న కివీస్, పాక్ జట్ల మధ్య.. నవంబర్ 10న ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య సెమీఫైనల్స్ మ్యాచ్ లు జరగనున్నాయి.
3/ 8
ఇక ప్రస్తుతం భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. దేశంతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు ఫిదా అవుతున్నారు.
4/ 8
భారత్ అంటే చాలు కడుపు మంటతో రగిలిపోయే పాకిస్తాన్ నుంచి కూడా సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. మాజీ కెప్టెన్ వసీం అక్రం అయితే సూర్యకుమార్ యాదవ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.
5/ 8
విరాట్ కోహ్లీలా క్లాస్ ఆటతో కాకుండా మాస్ ఆటతో సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. ఫీల్డ్ కు తగ్గట్లు తన బ్యాటింగ్ లో మార్పులు చేసుకుని పరుగులు సాధిస్తున్నాడు.
6/ 8
సూర్యకుమార్ యాదవ్ స్ట్రయికింగ్ లో ఉంటే ఎలాంటి ఫీల్డింగ్ పెట్టాలో తెలియక ప్రత్యర్థి కెప్టెన్లు తలలు బాదుకుంటున్నారు. ఇక బౌలర్లు అయితే ఎటువంటి బంతులు వేయాలో అర్థం కాక బౌలింగ్ ను మర్చిపోతున్నారు.
7/ 8
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ లోని అసలైన మిస్టర్ 360 ఆటగాడిని ప్రపంచానికి చూపించింది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బంతులను ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్ దిశలతో పాటు కవర్స్ మీదుగా భారీ షాట్లు ఆడి పరుగులు సాధించిన అతడి బ్యాటింగ్ కు సలాం కొడుతున్నారు.
8/ 8
సెమీస్ లో సూర్యకుమార్ యాదవ్ ను అవుట్ చేయడమే తమ టార్గెట్ అంటూ ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ పేర్కొనడం విశేషం. దీనిని బట్టే ప్రత్యర్థులను తన బ్యాటింగ్ తో ఎంతలా పరేషాన్ చేస్తున్నాడో అర్థం అవుతుంది.