IND vs ENG 2nd Semi Final : ఇంగ్లండ్ తో సెమీస్ పోరు.. టీమిండియా తరుపుముక్క ఇతడే
IND vs ENG 2nd Semi Final : ఇంగ్లండ్ తో సెమీస్ పోరు.. టీమిండియా తరుపుముక్క ఇతడే
IND vs ENG 2nd Semi Final : 2014లో ఫైనల్ వరకు చేరినా తుది మెట్టుపై బోల్తా పడింది. ఇక 2016లో సెమీస్ వరకు చేరింది. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా పొట్టి కప్పుతోనే భారత గడ్డపై అడుగుపెట్టాలనే పట్టదలతో రోహిత్ సేన ఉంది.
15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాలనే పట్టుదలతో టీమిండియా (Team India) ఆస్ట్రేలియా (Australia) గడ్డపై అడుగుపెట్టింది. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్ లో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. 15 ఏళ్లు గడుస్తున్నా మళ్లీ ఆ ఘనతను రిపీట్ చేయలేకపోయింది.
2/ 8
2014లో ఫైనల్ వరకు చేరినా తుది మెట్టుపై బోల్తా పడింది. ఇక 2016లో సెమీస్ వరకు చేరింది. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా పొట్టి కప్పుతోనే భారత గడ్డపై అడుగుపెట్టాలనే పట్టదలతో రోహిత్ సేన ఉంది.
3/ 8
అందులో భాగంగానే ఇప్పటికే టీమిండియా సెమీస్ చేరింది. విశ్వవిజేతగా నిలిచేందుకు భారత్ ముందు కేవలం రెండు మ్యాచ్ లే అడ్డంకిగా ఉన్నాయి. వీటిల్లో గెలిస్తే భారత్ పొట్టి ఫార్మాట్ లో రెండోసారి జగజ్జేతగా అవతరిస్తుంది.
4/ 8
అడిలైడ్ వేదికగా నవంబర్ 10న అంటే గురువారం రోజు జరిగే రెండో సెమీఫైనల్లో 2010 చాంపియన్ ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది. రెండు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి.
5/ 8
ఇక భారత జట్టు విషయానికి వస్తే సూర్యకుమార్య యాదవ్, విరాట్ కోహ్లీలు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో పేస్ త్రయం అర్ష్ దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, షమీలు అంచనాలకు మించి రాణిస్తున్నారు.
6/ 8
అయితే ఇంగ్లండ్ తో జరిగే పోరులో టీమిండియా నెగ్గాలంటే శక్తికి మించి పోరాడాల్సి ఉంది. ఒకరిద్దరు ప్లేయర్లపై కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ శక్తికి మించి ఆడాల్సి ఉంటుంది. పొరపాట్లను అస్సలే చేయరాదు.
7/ 8
ఇక ఈ మ్యాచ్ లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు తురుపుముక్కగా మారే అవకాశం ఉంది. తన వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. స్పిన్నర్లను ఎదుర్కొనడంలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటారు.
8/ 8
దాంతో పాటు అశ్విన్ బ్యాటర్ గా కూడా అక్కరకు వస్తున్నాడు. పాకిస్తాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో విన్నింగ్ షాట్ ఆడటంతో పాటు బంగ్లాదేశ్ పై కీలక సమయంలో బ్యాట్ తో పరుగులు సాధించాడు. దాంతో సెమీస్ లో భారత్ కు అశ్విన్ అవసరం ఎంతో ఉంది.