IND vs ENG 2nd Semi Final : ఒకే ఒరలో రెండు కత్తులు! ఇంగ్లండ్ తో ఆడే టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ పై రోహిత్..
IND vs ENG 2nd Semi Final : ఒకే ఒరలో రెండు కత్తులు! ఇంగ్లండ్ తో ఆడే టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ పై రోహిత్..
IND vs ENG 2nd Semi Final : బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రెండు జట్లు కూడా సమానంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించడం ఖాయం.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో ఇంగ్లండ్ (England)తో తాడో పేడో తేల్చుకునేందుకు భారత్ (India) సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగే రెండో సెమీఫైనల్ పోరులో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
2/ 9
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రెండు జట్లు కూడా సమానంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించడం ఖాయం.
3/ 9
ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ కఠోర సాధన చేస్తుంది. ఎటువంటి తప్పులు చేయకుండా పూర్తి ఆధిపత్యంతో ఇంగ్లండ్ ను గెలిచి ఫైనల్ కు చేరాలని పట్టుదలగా ఉంది.
4/ 9
ఇక సెమీఫైనల్లో ఆడే టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ పై ఊహాగానాలు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ను తీసుకుంటారా.. లేక దినేశ్ కార్తీక్ వైపు మొగ్గు చూపుతారా అని అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
5/ 9
ఇక అదే సమయంలో టోర్నీలో విఫలం అవుతున్న అక్షర్ పటేల్ స్థానంలో యుజువేంద్ర చహల్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం.
6/ 9
అయితే రోహిత్ శర్మ.. సెమీస్ లో ఆడే ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్ పై ప్రెస్ కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశాడు. వికెట్ కీపర్ గా ఎవర్ని తీసుకుంటారని రిపోర్టర్లు రోహిత్ ను ప్రశ్నించారు.
7/ 9
దీనిపై స్పందించిన రోహిత్.. ‘దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్.. సెమీస్ లో ఇద్దరు ఆడే అవకాశం ఉంద‘అంటూ కామెంట్స్ చేశాడు. ఈ టోర్నీలో బెంచ్ కే పరిమితం అయిన పంత్.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో తుది జట్టులోకి వచ్చాడు.
8/ 9
అయితే ఆ మ్యాచ్ లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. దాంతో అతడి స్థానంలో కార్తీక్ కు అవకాశం ఇస్తారని అంతా అనుకుంటున్నారు. అయితే తాజాగా రోహిత్ మాత్రం ఇద్దరు ఆడినా ఆశ్చర్యపోకండి అంటూ కామెంట్స్ చేశాడు.
9/ 9
తుది జట్టులో కార్తీక్, పంత్ ఉంటే మాత్రం అప్పుడు భారత్ ఒక స్పిన్నర్ తోనే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అడిలైడ్ లాంటి స్పిన్ వికెట్ పై భారత్ ఒకే స్పిన్నర్ తో ఆడుతుందా మరీ!