IND vs ENG : రోహిత్ టాస్ గెలవకూడదు.. రోహిత్ టాస్ గెలవకూడదు.. దేవుడిని ప్రార్థిస్తున్న టీమిండియా ఫ్యాన్స్
IND vs ENG : రోహిత్ టాస్ గెలవకూడదు.. రోహిత్ టాస్ గెలవకూడదు.. దేవుడిని ప్రార్థిస్తున్న టీమిండియా ఫ్యాన్స్
IND vs ENG 2nd Semi Final : న్యూజిలాండ్ పై పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్ కు చేరుకుంది. ఈ నెల 13న మెల్ బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో తమతో తలపడే ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తూ ఉంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ (England)తో భారత్ తలపడనుంది.
2/ 8
న్యూజిలాండ్ పై పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్ కు చేరుకుంది. ఈ నెల 13న మెల్ బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో తమతో తలపడే ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తూ ఉంది.
3/ 8
ఇక అడిలైడ్ వేదికగా జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ టాస్ ఓడిపోయాలని 139 కోట్ల భారతీయులు కోరుకుంటున్నారు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
4/ 8
అడిలైడ్ వేదికగా ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు జరిగాయి. ఈ 11 మ్యాచ్ ల్లోనూ టాస్ గెలిచిన జట్టు ఓటమి పక్షాన నిలిచింది. దాంతో ఇంగ్లండ్ తో జరిగే రెండో సెమీస్ లో భారత్ టాస్ ఓడిపోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
5/ 8
ఇక భారత్, ఇంగ్లండ్ జట్లు సమంగా ఉన్నాయి. రెండు జట్లు కూడా అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో పటిష్టంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను అలరించడం ఖాయం.
6/ 8
రోహిత్ శర్మ ఫామ్ భారత్ ను కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే రోహిత్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని గుర్తుంచుకోవాలి. కీలక మ్యాచ్ ల్లో ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అతడు తన బ్యాట్ కు తప్పకుండా పని చెబుతాడని క్రికెట్ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు.
7/ 8
కోహ్లీ, సూర్యకుమార్, రాహుల్ లకు రోహిత్ కూడా జతయితే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఇక బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, భునవేశ్వర్ కుమార్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. షమీ, అశ్విన్ రూపంలో ఇద్దరు వెటరన్ బౌలర్లు టీంలో ఉండటం భారత్ కు కలసివచ్చే అవకాశం ఉంది.
8/ 8
ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్ తాడో పేడో తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.