IND vs ENG : సూర్య, కోహ్లీ కాదు.. సెమీస్ లో ఈ టీమిండియా ప్లేయరే కీలకం
IND vs ENG : సూర్య, కోహ్లీ కాదు.. సెమీస్ లో ఈ టీమిండియా ప్లేయరే కీలకం
IND vs ENG 2nd Semi Final : రెండు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో రెండు జట్లు కూడా సమంగా ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగ లాంటిదని చెప్పొచ్చు.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) కీలక పోరుకు సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా నవంబర్ 10న ఇంగ్లండ్ (England)తో భారత్ (India) తాడోపేడో తేల్చుకోనునుంది.
2/ 8
రెండు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో రెండు జట్లు కూడా సమంగా ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగ లాంటిదని చెప్పొచ్చు.
3/ 8
ఇక భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో బ్యాటింగ్ లో నిలకడగా ఆడింది ఇద్దరు ప్లేయర్లు మాత్రమే. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు మాత్రమే నమ్మకంగా ఆడుతున్నారు.
4/ 8
ఇక గత రెండు మ్యాచ్ ల్లోనూ కేఎల్ రాహుల్ రెండు అర్ధ సెంచరీలు సాధించి టచ్ లోకి వచ్చాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల ఫామ్ భారత్ ను కలవరపెడుతుంది.
5/ 8
ఇక సెమీస్ పోరులో వీరు ఏ విధంగా బ్యాటంగ్ చేస్తారో అని అభిమానులు కాస్త భయంగానే ఉన్నారు. అయితే భారత్ మాజీ ప్లేయర్ మొహమ్మద్ కైఫ్ రోహిత్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
6/ 8
ఇంగ్లండ్ తో జరిగే సెమీఫైనల్లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడతాడని జోస్యం చెప్పాడు. కోహ్లీ, సూర్యకుమార్ ల కంటే కూడా రోహిత్ అదరగొట్టే అవకాశం ఉందని కైఫ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
7/ 8
టి20 ప్రపంచకప్ లో రోహిత్ ఇప్పటి వరకు నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే అర్ధ సెంచరీ చేశాడు. పాకిస్తాన్, సౌతాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్ లపై జరిగిన మ్యాచ్ ల్లో దారుణంగా విఫలం అయ్యాడు.
8/ 8
దాంతో మాజీ ప్లేయర్లు రోహిత్ పై విమర్శలు చేస్తున్నారు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ ఇలా విఫలం కావడం మంచిది కాదని పేర్కొంటున్నారు.