IND vs ENG 2nd Semi Final : స్యామ్ ను చితక్కొట్టాలంటే కాకా ఉండాల్సిందే.. పాత రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే?
IND vs ENG 2nd Semi Final : స్యామ్ ను చితక్కొట్టాలంటే కాకా ఉండాల్సిందే.. పాత రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే?
IND vs ENG 2nd Semi Final : ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్ తాడో పేడో తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) కీలక పోరుకు సిద్ధమైంది. 15 ఏళ్ల నిరీక్షణకు తెర దించి మరోసారి పొట్టి ప్రపంచకప్ వేదికపై విజేతగా నిలవడానికి రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉంది.
2/ 9
ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్ తాడో పేడో తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
3/ 9
ఇక ఇంగ్లండ్ తరఫున స్యామ్ కరణ్ డెత్ ఓవర్స్ స్పెషలిస్టుగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్ ల్లో 10 వికెట్లు తీసిన అతడు ఇంగ్లండ్ ను సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఎకానమీ కేవలం 5.875గా ఉండటం విశేషం.
4/ 9
ఈ టోర్నీలో ఇంగ్లండ్ పేస్ దళం పటిష్టంగా ఉంది. వోక్స్, వుడ్ ఆరంభంలో వికెట్లు తీస్తుంటే.. స్యామ్ కరణ్ డెత్ ఓవర్స్ లో ప్రత్యర్థులను భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంటున్నాడు.
5/ 9
ముఖ్యంగా స్యామ్ కరణ్ బౌలింగ్ లో పరుగులు సాధించేందుకు బ్యాటర్లు నానా తంటాలు పడుతున్నారు. దాంతో భారత్ తో జరిగే మ్యాచ్ లోనూ ప్రధాన అస్త్రంగా స్యామ్ కరణ్ ను ఉపయోగించుకోవాలని జాస్ బట్లర్ ఆలోచిస్తున్నాడు.
6/ 9
స్యామ్ కరణ్ ను ఎదుర్కొనడంలో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు ఇబ్బంది పడుతున్నారు. టి20ల్లో సూర్యకుమార్ యాదవ్ ను స్యామ్ కరణ్ ఏకంగా రెండు సార్లు అవుట్ చేశాడు. అదే విధంగా కోహ్లీని కూడా రెండు సార్లు అవుట్ చేశాడు.
7/ 9
సూర్యకుమార్ యాదవ్ కరణ్ బౌలింగ్ లో 8 బంతులు ఆడి 13 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులు చేశాడు. వీరిద్దరి రికార్డ్ కరణ్ విషయంలో అంత గొప్పగా ఏం లేదు.
8/ 9
అయితే దినేశ్ కార్తీక్ కు మాత్రం స్యామ్ కరణ్ పై సూపర్ రికార్డు ఉంది. కరణ్ బౌలింగ్ లో 26 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. ఏకంగా 64 పరుగులు చేశాడు. ఒకసారి మాత్రమే అవుటయ్యాడు. కరణ్ బౌలింగ్ లో 200కు పైగా స్ట్రయిక్ రేట్ తో కార్తీక్ పరుగులు సాధించడం విశేషం.
9/ 9
ఈ క్రమంలో కరణ్ కు చెక్ పెట్టాలంటే భారత్ దినేశ్ కార్తీక్ ను అస్త్రంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టీమిండియా బ్యాటర్లలో కార్తీక్ మాత్రమే స్యామ్ కరణ్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.