T20 World Cup 2022 : ఆ రెండు జట్ల చేతుల్లో ఆసీస్ జుట్టు.. గట్టున పడేస్తాయో లేక ముంచేస్తాయో తేలాంటే 24 గంటలు ఆగాల్సిందే
T20 World Cup 2022 : ఆ రెండు జట్ల చేతుల్లో ఆసీస్ జుట్టు.. గట్టున పడేస్తాయో లేక ముంచేస్తాయో తేలాంటే 24 గంటలు ఆగాల్సిందే
T20 World Cup 2022 : ప్రస్తుతం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ లతో కలిసి 5 పాయింట్లతో సమంగా ఉన్నా.. నెట్ రన్ రేట్ లో మాత్రం చాలా వెనుకబడి ఉంది. దాంతో మూడో స్థానంలో ఉంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో ఆస్ట్రేలియా (Australia)కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది.
2/ 8
న్యూజిలాండ్ తో జరిగిన ఆరంభ పోరులో ఏకంగా 89 పరుగుల తేడాతో ఓడి భారీ పరాజయం చవిచూసింది. ఆ తర్వాత శ్రీలంక, ఐర్లాండ్ లపై కిందామీదా పడుతూ గెలిచింది. ఇక ఇంగ్లండ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
3/ 8
ప్రస్తుతం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ లతో కలిసి 5 పాయింట్లతో సమంగా ఉన్నా.. నెట్ రన్ రేట్ లో మాత్రం చాలా వెనుకబడి ఉంది. దాంతో మూడో స్థానంలో ఉంది.
4/ 8
న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ +2.233గా ఉంటే ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ +0.547గా ఉంది. ఇక ఆస్ట్రేలియాది మాత్రం -0.347గా ఉంది. దాంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే తన ఆఖరి మ్యాచ్ లో గెలవడంతో పాటు కివీస్, ఇంగ్లండ్ జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.
5/ 8
ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే ఇవి జరిగి తీరాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం. న్యూజిలాండ్ పై ఐర్లాండ్ లేదా ఇంగ్లండ్ పై శ్రీలంక నెగ్గి.. అఫ్గాన్ పై ఆస్ట్రేలియా నెగ్గితే నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా ఆసీస్ సెమీస్ చేరుతుంది.
6/ 8
ఒకవేళ ఐర్లాండ్ పై న్యూజిలాండ్.. శ్రీలంకపై ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్ లో నెగ్గినా సెమీస్ చేరడం తలకు మించిన పని అవుతుంది. అందుకు కారణం నెట్ రన్ రేట్.
7/ 8
ఐర్లాండ్ పై పరుగు తేడాతో నెగ్గినా న్యూజిలాండ్ సెమీస్ చేరడం ఖాయం. అదే సమయంలో ఆసీస్ వెళ్లాలంటే మాత్రం అఫ్గానిస్తాన్ పై కనీసం 100 పరుగుల తేడాతో లేదా అఫ్గానిస్తాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని తక్కువ ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.
8/ 8
అంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా సెమీస్ చేరడం అనేది ఐర్లాండ్, శ్రీలంక చేతుల్లో ఆధారపడి ఉందన్నమాట. ఈ రెండు జట్లలో ఒక్కటి అయినా తమ ప్రత్యర్థులపై గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్ చేరడం పక్కా.