టీ20 ప్రపంచకప్ కౌంట్ డౌన్ షురూ అయింది. ఐదు రోజుల కంటే తక్కువ వ్యవధిలో టి20 ప్రపంచకప్2022 (T20 World Cup 2022) మహా సంగ్రామం ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. సొంత గడ్డపై కంగారూ టీం డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెడుతున్నారు.
రోహిత్ శర్మ (కెప్టెన్ ) : టీమిండియాకు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం దక్కాలంటే రోహిత్ శర్మ ఎంతో కీలకం. టీ20 ప్రపంచకప్లో 33 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 38.50 సగటుతో 847 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ స్కోరు 79 నాటౌట్. ఇదే ఫామ్ ఈ ప్రపంచకప్ లో కూడా కంటిన్యూ చేస్తే టీమిండియాకు తిరుగుండదు. (AFP)
విరాట్ కోహ్లీ : టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. అతను ఆసియా కప్ 2022 ద్వారా తిరిగి ఫామ్లోకి వచ్చాడు. 33 ఏళ్ల విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 21 మ్యాచ్ల్లో 76.81 సగటుతో 10 అర్ధ సెంచరీలతో 845 పరుగులు చేశాడు. విరాట్ అత్యుత్తమ స్కోరు 89 నాటౌట్. ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 78 ఫోర్లు, 20 సిక్సర్లు కొట్టాడు.
దినేష్ కార్తీక్ : సూర్య తర్వాత దినేశ్ కార్తీక్ టి20 ప్రపంచకప్ లో ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫినిషర్ రోల్ తో పాటు వికెట్ కీపర్ గా కార్తీక్ తుది జట్టులో ఆడటం ఖాయం. చివర్లో తక్కువ బంతుల్లో కీలకమైన పరుగులను రాబట్టడంలో దినేశ్ కార్తీక్ సక్సెస్ అవుతున్నాడు. అంతేకాకుండా అతడి అనుభవం కూడా జట్టుకు అక్కరకు రానుంది.
అక్షర పటేల్ : జడేజా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్.. ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ తో తనను తాను నిరూపించుకున్నాడు. ముఖ్యంగా అతడి బంతులను ఎదుర్కోవడం రైట్ హ్యాండర్స్ కు సవాల్ గా మారనుంది. టర్న్, వితౌట్ టర్న్ తో బౌలింగ్ చేయడంలో అక్షర్ దిట్ట. అంతేకాకుండా పవర్ ప్లే తో పాటు డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేయడం అక్షర్ లోని మరో ప్రత్యేకత.
యుజువేంద్ర చాహల్ : ఆస్ట్రేలియా లాంటి పెద్ద పిచ్ లపై చాహల్ టీమిండియాకు ప్లస్ పాయింట్. అతని బౌలింగ్ లో భారీ షాట్లు ఆడటం చాలా కష్టం. ఎందుకంటే బౌండరీలు పెద్దగా ఉండటం వల్ల బ్యాటర్లు మిస్ ఫైర్ అయ్యే ఛాన్సుంది. చాహల్ ఎలా బౌలింగ్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత కొద్ది మ్యాచుల్లో చాహల్ అంత పెద్దగా రాణించింది లేదు.
అర్ష్ దీప్ సింగ్ : ఈ యంగ్ బౌలర్ చాలా మంది మాజీ క్రికెటర్లను ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ లో కూడా మెరిశాడు. అంతేకాకుండా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో మూడు వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో రోహిత్ శర్మకి అర్ష్ దీప్ మంచి ఆప్షన్. అర్ష్ దీప్ కు ఉన్నా మరో అడ్వాండేజ్ అతని హైట్. ఆస్ట్రేలియా పిచ్ లపై మంచి బౌన్స్ రాబట్టడానికి అతని హైట్ ఎంతో హెల్ప్ కానుంది.
ఇక, స్పిన్ విభాగంలో అశ్విన్ వద్దనుకుంటే హర్షల్ పటేల్, మహ్మద్ షమీల్లో ఒకరు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే, హర్షల్ పటేల్ పెద్ద ఫాంలో లేడు. అలాగే, షమీ కూడా గాయం నుంచి కోలుకుని ఇప్పుడే జట్టులోకి వచ్చాడు. వీరిద్దరి కన్నా సిరాజ్ రోహిత్ శర్మకి బెటర్ ఆప్షన్ అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.