దాంతో సెమీస్ చేరిన నాలుగు జట్లు కూడా కఠోరంగా సాధన చేస్తున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ (NZ vs PAK).. అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ (IND vs ENG) తలపడనుంది. దీంతో ఈ మ్యాచుల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (PC : TWITTER)
2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. భారత్ ఓటమిపాలైంది. దీంతో.. ఈ సారి రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడంతో టీమిండియాదే కప్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (Twitter)