అయితే సెమీస్ లాంటి చోట ఓడటం ఎవరికైనా బాధగా ఉంటుదని పేర్కొన్న సచిన్.. ప్రస్తుతం భారత అభిమానులు కూడా అదే వ్యథకు గురవుతున్నారని వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్ లాంటి చోట అందులోనూ సెమీస్ లో భారత్ ఏ మాత్రం పోరాటం ఇవ్వకుండా ఓడటాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని.. వారి బాధ తనకు అర్థం అవుతుందని తెలిపాడు.