T20 World Cup 2022 Final : ఈ ప్రపంచకప్ లో ఫైనల్ చేరితే చాలు కప్పు గ్యారెంటీ.. ఎలాగంటారా?
T20 World Cup 2022 Final : ఈ ప్రపంచకప్ లో ఫైనల్ చేరితే చాలు కప్పు గ్యారెంటీ.. ఎలాగంటారా?
IND vs ENG 2nd Semi Final : అయితే చివరి మూడు మ్యాచ్ ల్లో పాకిస్తాన్ నెగ్గడంతో పాటు కీలక మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో భారత్ తో పాటు పాకిస్తాన్ కూడా సెమీస్ చేరింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ (Pakistan) ఫైనల్స్ కు చేరుకుంది. జింబాబ్వే (Zimbabwe) చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ సెమీస్ చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు.
2/ 10
అయితే చివరి మూడు మ్యాచ్ ల్లో పాకిస్తాన్ నెగ్గడంతో పాటు కీలక మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో భారత్ తో పాటు పాకిస్తాన్ కూడా సెమీస్ చేరింది.
3/ 10
ఇక న్యూజిలాండ్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో నవంబర్ 13న మెల్ బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో పాక్ తలపడనుంది.
4/ 10
అయితే నవంబర్ 13న మెల్ బోర్న్ సిటీ అంతా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సెమీస్, ఫైనల్ కు రిజర్వ్ డేలు ఉన్నాయి. ఒక వేళ ఫైనల్ పోరు నవంబర్ 13న (ఆదివారం) జరగకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం (నవంబర్ 14న) నిర్వహిస్తారు.
5/ 10
అయితే నవంబర్ 14న కూడా మెల్ బోర్న్ సిటీకి వర్షం ముప్పు ఉంది. ఆది, సోమ వారాల్లో మెల్ బోర్న్ సిటీలో రోజంతా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది.
6/ 10
వర్షంతో ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించలేకపోతే అప్పుడు విజేతను ఎలా నిర్ణయిస్తారు? అని చాలా మంది క్రికెట్ అభిమానుల్లో ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఐసీసీకి వద్ద దీనికి సమాధానం కూడా ఉంది.
7/ 10
సెమీఫైనల్స్ మ్యాచ్ లను వర్షంతో నిర్వహించలేకపోతే (రిజర్వ్ డే రోజు కూడా) అప్పుడు గ్రూప్ లో టాపర్ గా నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. అయితే ఫైనల్లో ఇలా ఉండదు.
8/ 10
ఒక వేళ ఫైనల్ మ్యాచ్ ను వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా నిర్వహించలేకపోతే అప్పుడు ఇరు జట్లను సంయుక్త విజేతగా డిక్లేర్ చేస్తారు. ఇది కొంచెం విడ్డూరంగా ఉన్నా నిజం.
9/ 10
2002లో శ్రీలంక వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ను వర్షంతో రిజర్వ్ డే రోజు కూడా నిర్వహించలేకపోతారు. దాంతో ఫైనల్ చేరిన భారత్, శ్రీలంక జట్లను సంయుక్త విజేతగా నిర్వహిస్తారు.
10/ 10
నవంబర్ 13, 14వ తేదీల్లో మెల్ బోర్న్ సిటీ అంతా వర్ష సూచన ఉండటంతో ఈసారి రెండు జట్లు చాంపియన్ లుగా అవతరించే అవకాశం ఉంది. అదే జరిగితే సెమీఫైనల్ గెలిచిన జట్లు ఫైనల్ ఆడకుండానే చాంపియన్ లుగా నిలుస్తాయన్నమాట.