Team India : కీపింగ్ లో దిట్ట.. మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో సూపర్.. ధోనిలా కూల్.. ఇన్ని ఉన్నా టీమ్ కు దూరంగానే
Team India : కీపింగ్ లో దిట్ట.. మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో సూపర్.. ధోనిలా కూల్.. ఇన్ని ఉన్నా టీమ్ కు దూరంగానే
Team India : ఓటమి తర్వాత ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శల వర్షం కురుస్తుంది. ప్రపంచకప్ కోసం వెళ్లిన టీమిండియా జట్టులో నలుగురు (కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, అర్ష్ దీప్) మినహా మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు.
సెమీఫైనల్లో ఓడిన టీమిండియా (Team India) భారంగా టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022 నుంచి వైదొలిగింది. ఆడిన ప్లేయర్లకు ఎంత బాధ ఉందో అంతకు మించిన బాధ టీమిండియా అభిమానులది.
2/ 9
ఓటమి తర్వాత ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శల వర్షం కురుస్తుంది. ప్రపంచకప్ కోసం వెళ్లిన టీమిండియా జట్టులో నలుగురు (కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, అర్ష్ దీప్) మినహా మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు.
3/ 9
ఇక వికెట్ కీపర్లుగా ప్రపంచకప్ కు ఎంపికైన దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. విఫలం అవ్వడంలో వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.
4/ 9
అటు డీకే.. ఇటు పంత్ ఒక్క మ్యాచ్ లో కూడా కనీసం 10 పరుగులు చేయలేకపోయారు. నిజాయితీగా చెప్పాలంటే వీరిద్దరి కంటే కూడా సంజూ సామ్సన్ 1000 రెట్టు బెటర్. కానీ, సంజూకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతూనే వస్తుంది.
5/ 9
ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు మంచి ఫినిషింగ్స్ ఇచ్చాడన్న ఒకే ఒక్క కారణంతో కార్తీక్ ను టీమిండియాకు మళ్లీ ఎంపిక చేశారు. ఇక రిషభ్ పంత్ ఐపీఎల్ లో ఆడకపోయినా అతడిని టీంతో కొనసాగిస్తూనే ఉన్నారు. పంత్ గొప్పగా ఆడింది మాత్రం టెస్టులే అని చెప్పాలి.
6/ 9
పరిమిత ఓవర్ల క్రికెట్ లో పంత్ చెప్పుకోవడానికి ఒక్క గొప్ప ఇన్నింగ్స్ కూడా లేదు. పంత్, డీకే తో పోలిస్తే సంజూ సామ్సన్ బెటర్. ఐపీఎల్ లో రాజస్తాన్ ను ఫైనల్స్ వరకు చేర్చాడు. ఇక టీమిండియా తరఫున తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి రాణించాడు.
7/ 9
భారత్ తరఫున సంజూ సామ్సన్ చివరగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడాడు. అందులో వరుసగా 86 నాటౌట్, 30 నాటౌట్, 2 నాటౌట్ గా నిలిచాడు. అంతకుమందు న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన మ్యాచ్ లో 54 పరుగులు చేశాడు. అయినా సంజూ సామ్సన్ ను టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేయలేదు.
8/ 9
సామ్సన్ ధోనిలా మైదానంలో చాలా కూల్ గా ఉంటాడు. ఇక కీపింగ్ లో కూడా సంజూ సామ్సన్ చురుకుగా ఉంటాడు. విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను చూసిన వారికి ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అయినా సామ్సన్ కు పంత్ కు వచ్చినన్ని అవకాశాలు రావడం లేదు.
9/ 9
తాజాగా కివీస్ తో జరిగే టి20, వన్డే సిరీస్ లకు పంత్ ఎంపికయ్యాడు. కానీ, ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు మాత్రం ఎంపిక చేయలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో మరోసారి సామ్సన్ కు అన్యాయం జరిగేలానే కనిపిస్తుంది.