టీ-20 వరల్డ్‌కప్ (T-20 World Cup) 2022 నుంచి భారత్ (Team India) అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో పొట్టి ఫార్మాట్ లో 2007 తరువాత వరల్డ్ కప్‌ను ముద్దాడాలనే కల తీరుకుండానే ఆస్ట్రేలియా నుంచి ఇంటి బాట పట్టింది.
కనీసం 7 టెస్టు మ్యాచ్ లు కానీ, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ, లేక 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వారు కూడా అర్హులు అని వివరించింది. ఆట నుంచి ఐదేళ్ల కిందటే రిటైరై ఉండాలని పేర్కొంది. మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని తెలిపింది. నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఈ లెక్కన చూసుకుంటే.. టీమిండియాలో కూడా భారీ మార్పులు కన్పించే అవకాసం ఉంది. ఇందులో భాగంగానే టి20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మను టి20 కెప్టెన్ గా తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను ఫుల్ టైమ్ కెప్టెన్ గా నియమించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రోహిత్ తో పాటు సీనియర్లు కోహ్లీ, షమీ, భువీ, కార్తీక్, అశ్విన్ ల కు టీ20ల నుంచి ఉద్వాసన పలకడానికి సిద్దమైంది బీసీసీఐ.