T20 World Cup 2022 : టీమిండియాను హేళన చేశాడు.. బొక్క బోర్లా పడ్డాడు.. పాక్ మాజీ పేసర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత ప్లేయర్
T20 World Cup 2022 : టీమిండియాను హేళన చేశాడు.. బొక్క బోర్లా పడ్డాడు.. పాక్ మాజీ పేసర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత ప్లేయర్
T20 World Cup 2022 : ఇక ఫైనల్ కు ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. ఫ్యాన్స్ చేసిన రచ్చ మాములుగా లేదు. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడటంతో పాక్ సెమీస్ చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు. అయితే అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడటంతో పాక్ సెమీస్ చేరింది.
దాదాపు నెల రోజుల పాటు అలరించిన టి20 ప్రపంచకప్ (T20 World Ccup) ముగిసింది. మెల్ బోర్న్ (Melbourne) వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan)పై ఇంగ్లండ్ (England) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో టి20 ప్రపంచకప్ ను రెండోసారి ముద్దాడింది.
2/ 8
ఇక ఫైనల్ కు ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. ఫ్యాన్స్ చేసిన రచ్చ మాములుగా లేదు. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడటంతో పాక్ సెమీస్ చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు. అయితే అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడటంతో పాక్ సెమీస్ చేరింది.
3/ 8
ఇక సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై పాకిస్తాన్ విజయం సాధించడం.. అదే సమయంలో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో పాక్ మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ టీమిండియాను టార్గెట్ చేశారు.
4/ 8
ఇక పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అయితే చెత్త వాగుడు వాగాడు. సెమీస్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడటంతో షోయబ్ చెలరేగిపోయాడు. ‘ఈ ఆటతో ఎలా ఫైనల్ చేరతారనుకున్నారు. పాకిస్తాన్ తో భారత్ కు ఫైనల్లో ఆడే అర్హత లేదంటూ’ తీవ్ర విమర్శలు చేశాడు.
5/ 8
అయితే ఇప్పుడు ఫైనల్లో పాక్ ఓడిపోవడంతో టీమిండియా అభిమానులు, మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో షమీ షోయబ్ అక్తర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
6/ 8
‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ అంటూ ట్విట్టర్ లో షోయబ్ అక్తర్ గతంలో భారత్ పై చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షమీ ట్వీట్ వైరల్ అవుతుంది. (PC : TWITTER)
7/ 8
పాకిస్తాన్ సెమీస్ చేరడానికి ముఖ్య కారణం లక్. నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా గెలిచి ఉంటే ఎప్పుడో తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లాల్సి ఉంది. అయితే అనూహ్యంగా సఫారీపై నెదర్లాండ్స్ గెలవడంతో పాక్ సెమీస్ చేరింది.
8/ 8
ప్రతి మ్యాచ్ లోనూ లక్ తో గెలవాలనుకుంటే కష్టమని పాకిస్తాన్ జట్టు ప్రదర్శనతో తేలిపోయింది. బౌలింగ్ బాగున్నా.. బ్యాటింగ్ లో టెస్టు ప్లేయర్లు ఉండటం ఆ జట్టు ఫైనల్ ఓటమికి ముఖ్య కారణం.