ఇక ఫైనల్లో మరోసారి కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. సెమీస్ లో రెచ్చిపోయిన ఓపెనర్లు బట్లర్, హేల్స్ ఫైనల్లో విఫలం అయితే.. స్టోక్స్ మాత్రం మరోసారి బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా నిలిచాడు. అజేయమైన 52 పరుగులతో జట్టును చాంపియన్ గా నిలబెట్టాడు. స్టోక్స్ లాంటి మ్యాచ్ విన్నర్ ఉంటే ఏ జట్టుకైనా తిరుగుండదని మరోసారి రుజువైంది. (PC : TWITTER).